వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరూ అనుకున్నంత దూకుడు కంటే కూడా మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి. నవ్యాంధ్ర సీఎంగ పదవీ ప్రమాణం చేసిన రోజునే సీఎంఓ కార్యాలయంలోని నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి పారేసిన జగన్... అదే రోజు రాత్రికంతా డీజీపీని కూడా మార్చేశారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏకంగా వెయిటింగ్ లో పెట్టేశారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ పాలనలో అప్పటి చంద్రబాబు సర్కారుకు అనుకూలంగా వ్యవహరించిన వారంతా ఇకపై శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందేనన్న సంకేతాన్ని జగన్ పంపించారన్న వాదన వినిపిస్తోంది.
తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం అటు టీడీపీ నేతలతో పాటు ఇటు ఏపీ ప్రజలకు కూడా షాకింగ్ గా నిలిచిందని చెప్పక తప్పదు. అసలు ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయమేంటంటే... ఏపీలోకి సీబీఐ అధికారుల ప్రవేశం, దర్యాప్తులపై చంద్రబాబు సర్కారు విధించిన నిషేదాన్ఇన జగన్ ఎత్తేశారు. అంటే... ఇకపై గతంలో ఎలాగైతే సీబీఐ అధికారులు తమ దర్యాప్తును ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించారో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించవచ్చన్న మాట. తమకు అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిపై సీబీఐకి దాడులు, సోదాలు చేసే అధికారం ఉందన్న మాట. ఎన్నికలు చాలా ముందుగానే వరుసగా టీడీపీ నేతలపై జరిగిన సీబీఐ సోదాలు, ఐటీ దాడులు, ఈడీ విచారణలపై చంద్రబాబు సర్కారు చాలా సీనియస్ గానే స్పందించింది. బీజేపీతో పొత్తు తెంచుకున్న తర్వాత కేంద్రంలోని మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే తమ నేతలపై దాడులు చేయిస్తోందని ఆరోపించిన చంద్రబాబు... సీబీఐ అధికారుల ప్రవేశంపై గతేడాది నవంబర్ 17న నిషేదం విధించారు. ఈ నిర్ణయం నాడు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ నిషేదం ఉన్నంత కాలం సీబీఐ అధికారులు ఏపీలో ఫ్రీగా దర్యాప్తులు చేపట్టలేరు. కోర్టు ఆదేశాలు, ఏపీ సర్కారు అనుమతించిన కేసుల్లోనూ సీబఐ దర్యాప్తు చేయగలుగుతుంది. అయితే జగన్ సీఎం కాగానే రాష్ట్రంలో తాము నమోదు చేసిన కేసులు, వాటి దర్యాప్తు పరిస్థితులపై సీబీఐ అధికారులు వివరించారు. స్వయంగా సీబీఐ ఉన్నతాధికారులు జగన్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సీబీఐపై అమలవుతున్న నిషేదాన్ని ఎత్తివేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. తనపై రాజకీయ ప్రేరేపితంగా నమోదైన కేసుల్లో తనను అరెస్ట్ చేసిన సీబీఐపై అమలవుతున్న నిషేదాన్ని జగన్ ఎత్తివేయడం అంటే మాటలు కాదు కదా. అందుకే ఈ నిర్ణయం ఏపీలో పెను సంచలనంగా మారిపోయింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఫరిడవిల్లాలన్న కాంక్షతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.