జ‌గ‌న్ సార్‌.. మ‌న నేత‌ల ప‌రిస్థితీ.. 0.0001 ప‌ర్సంటేనా?

Update: 2022-03-27 02:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే ఒక మాట చెబుతున్నారు. "మ‌నం ఎన్నో కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నాం. ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి. ఆయా ప‌థ‌కాల‌ను వివ‌రించండి. వారి బాధలు కూడా తెలుసుకోండి" అని. కానీ, ఎవ‌రు వింటున్నారు?  ఎవ‌రు నిజంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు? అనే విష‌యాలు ఆరా తీస్తే.. మొన్న అసెంబ్లీ అమ‌రావ‌తి గురించి మాట్లాడుతూ.. జ‌గ‌న్ చెప్పిన‌.. 0.0001 ప‌ర్సంట్ నేత‌లు మాత్ర‌మే ఉంటున్నార‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. నిజానికి ఏ పార్టీకైనా.. ఏనేత‌కైనా.. ఆత్మ విమ‌ర్శ అవ‌స‌రం. తాము ఏం చేస్తున్నాం.. ఏం చేయాలి.. ఏం చేస్తామ‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు హామీలు ఇచ్చాం.. ఇప్పుడు ఎలావ్య‌వ‌హ‌రిస్తున్నాం.. అనేది!

అంతేకాదు.. ఏ నేత‌కైనా నేటి కాలంలో ప్ర‌జ‌లు ఏం ఆలోచిస్తున్నారు.. వారికి మ‌న‌కు మ‌ధ్య ఉన్న బంధం ఎలా ఉంది..? అనే విష‌యాలు తెలుసుకోవ‌డం కూడా అత్యంత అవ‌స‌రం. ఇది లేక‌పోతే.. ఎంతటి కండ‌లు తిరిగిన నాయ‌కుడు అయినా.. ప్ర‌జ‌ల ముందు.. వారి ఇచ్చే తీర్పు ముందు పిల్లి మొగ్గ‌లు వేయాల్సిందే. ఈ నేప‌థ్యంలో నాయ‌కులు ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. తాము చేస్తున్న త‌ప్పుల‌ను గుర్తించ‌డం.. వాటిని స‌రిదిద్దుకోవ‌డం వంటి చ‌ర్య‌ల దిశ‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ ప‌రోక్షంగా నాయ‌కుల‌ను హెచ్చ‌రిస్తున్నారు.

సాధార‌ణంగా ఎవ‌రైనా త‌ప్పులు చేసే వారే. త‌ప్పులు చేయ‌కుండా ఎవ‌రూ ఉండ‌రు. కానీ, వాటిని గుర్తించడం అనేది నేత‌ల‌కు అత్యంత అవ‌స‌రం. పైగా రాజ‌కీయంగా కొత్త నేత‌లు వ‌స్తున్నారు. పాత నేత‌లు విజృంభిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడున్న అధికార పార్టీ నాయ‌కులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికే రెండున్న‌ర సంవ‌త్సాలు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి. వీటిలో రెండేళ్లు అస‌లు క‌రోనాతో తీవ్ర‌స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే రెండేళ్ల‌పాటు.. అత్యంత కీల‌క మైన స‌మ‌యం. మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌న్నా.. ఎమ్మెల్యేలుగా తాము విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నా.. ఈ రెండేళ్ల స‌మ‌యం అత్యంత కీల‌కం.

ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. ఇప్పుడున్న ఎమ్మెల్యేల‌కు రెండే వ్యాప‌కాలు క‌నిపిస్తున్నాయి. అందితే ప‌ద‌వి(మంత్రి), లేక‌పోతే.. వ్యాపారం. ఈ రెండే త‌ప్ప‌.. మ‌రో వ్యాప‌కం ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల నుంచే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కానీ, వాస్త‌వానికి ప్ర‌జ‌ల కోసం.. పాకులాడితేనే ఉన్న ప‌ద‌వులు మిగిలి.. మ‌ళ్లీ నెగ్గుతారు.లేక‌పోతే.. మాజీలుగా మార్చేందుకు ప్ర‌జ‌ల‌కు ఎక్కువ స‌మ‌యం ప‌ట్టదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. ఒక‌వైపు .. ముఖ్యమంత్రి, వైసీపీ అదినేత జ‌గ‌న్ ఎమ్మెల్యేల‌కు ప‌దేప‌దే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండాల‌ని.. ప్ర‌ల‌జ స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవాల‌ని.. కోరుతున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌(జిల్లాకు) మిగిలిన వారు వారి సొంత కార్య‌క్ర‌మాల్లోనే మునిగిపోతున్నారు. దీంతో ప్ర‌తిప‌క్షాలు పుంజుకుంటున్న ప‌రిస్థితి గ‌త ఆరు మాసాల్లో క‌నిపిస్తోంది. కేవ‌లం జ‌గ‌న్ ఇమేజ్‌ను న‌మ్ముకున్నాం.. క‌దా.. మ‌న‌కేం కాదులే. అనుకుంటే.. పొర‌పాటే అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇమేజ్ జోరుగా ఉన్న స‌మ‌యంలోనూ 23 మంది నాయ‌కులు.. ఓడిపోయిన విష‌యం గుర్తించాల‌ని అంటున్నారు. పైగా ఇప్పుడు జ‌గ‌నే నాయ‌కుల‌పై ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంద‌ని.. కూడా హెచ్చ‌రిస్తున్నారు. అందుకే ఇటీవ‌ల కాలంలో ఆయ‌న టోన్ కూడా మారిపోయింది. "మీరు గెల‌వాలి.. పార్టీని గెలిపించాలి" అని పిలుపు ఇస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు క‌దులుతారో లేదో చూడాలి.
Tags:    

Similar News