విభజన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని సీఎం జగన్ అన్నారు. కేంద్రం సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్‌నిర్మాణానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించి బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. అంతేకాదు.. కేంద్రంతో తమ బంధం కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని అన్నారు.
జగన్ ఇంకా ఏమన్నారంటే..
''విశాఖపట్నంలో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం జనసంద్రాన్ని తలపిస్తోంది. జన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఉత్తరాంధ్ర జనం ప్రభంజనం మాదిరిగా కదిలివచ్చింది.
ఇవాళ దాదాపు రూ.10వేల కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ప్రధానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు(కానీ , ఇవి రాష్ట్రానికి ఏ రకంగానూ ఉపయుక్తం కాదనేది మేధావుల మాట) అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత రాష్ట్రంలో మా ప్రాధాన్యత.
ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదు. పెద్ద మనస్సుతో మీరు చూపే ప్రేమ ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు పలు అంశాలపై విజ్ఞప్తి చేశాం. ఏపీకి సహాయ సహకారాలు అందించాలి'' అని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
నెటిజన్ల కామెంట్లు ఇవే..
జగన్ చేసిన కామెంట్లపై ఏపీ నెటిజన్లు ఆసక్తిగా స్పందించారు. ఏపీ ప్రయోజనాలే గీటురాయిగా కేంద్రంతో చెలిమి చేస్తున్నామన్న సీఎం జగన్.. మరి ఈ మూడున్నరేళ్లలో ఒక్కటైనా సాధించారా? అనేది ప్రశ్న. ప్రత్యేక హోదా, విభజన సమస్యలు, నీటి వివాదాలు, పోలవరం నిధులు, విశాఖ రైల్వే జోన్.. జిల్లాల నిధులు వీటిలో ఏ ఒక్కటైనా సీఎం జగన్ సాధించిన పరిస్థితి ఉందా? అనేది నెటిజన్ల ప్రశ్న. కేవలం తనను తాను కాపాడుకునేందుకు మాత్రమే కేంద్రంతో చెలిమి చేస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.