ఏదైనా ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటే.. దానికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవడం ఏ ప్రభుత్వానికైనా కీలకం. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నా..చాలా మేరకు వీగిపోయాయి. అనేక విషయాలు కోర్టుల్లోనూ.. పార్లమెంటులోనూ పెండింగులో పడ్డాయి. ఉదాహరణకు కాపుల రిజర్వేషన్ ను 4శాతం పెంచుతూ.. చంద్రబాబు చేసిన తీర్మానం.. ఇప్పటికీ పార్లమెంటు లేదా కేంద్రంలోనే పెండింగులో ఉంది. దీంతో ఆయన రాజకీయంగా చాలా దెబ్బ పడిపోయింది. ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో మాత్రం ఇలాంటి తప్పులు లేకుండా రాకుండా.. చూసు కుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా ఆయన రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
ఈ ఏడు మాసాల కాలంలో ఇసుక సహా టీడీపీ నాయకులపై దాడుల అంశం విషయాల్లో ఒకింత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొన్నారు. అయితే, ఆ రెండు విషయాల్లోనూ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బయట పడ్డారు.తనపై ఎలాంటి మచ్చలు - మరకలు లేకుండా - పడకుండా చూసుకున్నారు. తాజాగా ఆయన ఎత్తున్న మూడు రాజధానుల విషయాన్ని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విమర్శిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. పిడివాదానాకే ప్రాధాన్యం ఇస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని జగన్ చెబుతున్నా.. కూడా విపక్షాలు న్యాయ పోరాటం సహా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తామని - ప్రధాని మోడీని ఈ విషయంలో ఇంప్లీడ్ చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో జగన్ మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
తాను అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పాటు.. ఎక్కడా కూడా న్యాయ పోరాటంలోను - ఒకవేళ రేపు కేంద్రం జోక్యం చేసుకున్నా కూడా .. తాను తప్పు చేసినట్టు రుజువు కాకుండా కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇప్పటికే జీ ఎన్ రావు కమిటీ నివేదిక తెప్పించుకున్నారు. అదేసమయంలో బీసీజీ ని అధ్యయనం కోసం పంపారు. ఈ నివేదిక త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. వీటిని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోమూడు రాజధానులు ఏర్పాటు చేయాలని అనుకున్న జగన్ అనూహ్యంగా సీనియర్ మంత్రులు, అధికారులతో కూడిన హైపవర్ కమిటీని నియమించారు. అంటే.. ఎక్కడా కూడా తాము అధ్యయనం చేయకుండా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. దీనిని ఎక్కడా కూడా న్యాయ వ్యవస్థ కూడా తప్పు పట్టకుండా గతంలో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా జగన్ తెరమీదకి తెస్తున్నారు.
ఇక, హైపవర్ కమిటీ కూడా ఓ నిర్ణయం ప్రకటించిన తర్వాత దానిని కేబినెట్‌లో పెట్టి చర్చించి ఆమోదం తెలపడం ద్వారా పూర్తిగా కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం లేకుండా చేయాలని భావిస్తున్నారు., అదేసమయంలో దీనినిఅసెంబ్లీలోనూ ప్రవేశ పెట్టనున్నారు. అయితే, అసెంబ్లీలో జగన్‌కు బలం బాగానే ఉన్నా..మండలిలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి బలం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడా తాము చేసిన నిర్ణయం వీగిపోకుండా జాగ్రత్త పడేలా.. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి.. తద్వారా మెజారిటీ సాధించి ఆమోద ముద్ర వేయించుకునేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే.. ఇక, జగన్ నిర్ణయమే అమలు కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు.