జ‌గ‌న్ ప్ర‌మాణం త‌ర్వాతే చంద్ర‌బాబు!

Update: 2019-06-11 08:26 GMT
ఏపీలో కొత్త ప్ర‌భుత్వం కొలువు తీర‌టం తెలిసిందే. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వంతో పాటు.. మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వాలు పూర్తి అయ్యాయి. నిన్న‌నే (సోమ‌వారం) రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం కూడా నిర్వ‌హించారు. సానుకూల దృక్ఫ‌దంతో దూసుకెళుతున్న జ‌గ‌న్‌.. పాల‌న‌లో త‌న‌దైన మార్క్ ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

అతి స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే.. రేపు (బుధ‌వారం) నుంచి అసెంబ్లీ స‌మావేశాలు షురూ కానున్నాయి. ఈ స‌మావేశాల్లో మొన్న‌టి ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తో పాటు విప‌క్ష నేత చంద్ర‌బాబుతో స‌హా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి చేత ప్ర‌మాణస్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. రేప‌టి ప్ర‌మాణ‌స్వీక‌రోత్స‌వ కార్య‌క్ర‌మం ఎలా సాగుతుందో చీప్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత‌రెడ్డి మాట్లాడారు.

ఆయ‌న చెప్పిన దాని ప్ర‌కారం.. రేపు స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేస్తార‌ని.. ఆయ‌న చేసిన త‌ర్వాతే విప‌క్ష నేత చంద్ర‌బాబు చేత ప్ర‌మాణం చేయించనున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. గురువారం స్పీక‌ర్ ఎన్నిక ఉంటుంద‌ని.. 14న ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉండ‌నుంది.

గ‌త ప్ర‌భుత్వం మాదిరి కాకుండా స‌భ‌ను హుందాగా న‌డిపిస్తామ‌ని గ‌డికోట తెలిపారు. స‌భ‌లో ప్ర‌తిపక్షాన్ని గౌర‌విస్తామ‌న్న ఆయ‌న‌.. విప‌క్ష నేత‌లంద‌రి చేతా మాట్లాడిస్తామ‌న్నారు. బాబు హ‌యాంలో మాదిరి కాకుండా ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌కు ఛాంబ‌ర్ కూడా ఇవ్వ‌కుండా హేళ‌న చేశార‌ని.. త‌మ ప్ర‌భుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంద‌ని మాట్లాడారు.


Tags:    

Similar News