మోడీని పేరు పెట్టి టార్గెట్ చేసిన జ‌గ‌న్‌

Update: 2015-10-23 08:48 GMT
ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంపై  ఆ రాష్ర్ట ప్ర‌తిప‌క్ష నేత‌ -  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హీట్ పెంచారు. అమ‌రావ‌తి శంకుస్థాపనకు వచ్చిన ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రత్యేక హోదా, ప్యాకేజీపై ఎలాంటి ప్రకటన చేయ‌ని నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌నదైన శైలికి భిన్నంగా స్పందించారు. ఈ ద‌పా ప్ర‌ధాన‌మంత్రి మోడీని నేరుగా టార్గెట్ చేస్తూ..ఆయ‌న పేరు ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శ‌లు చేశారు. ప‌నిలో పనిగా పార్టీ త‌ర‌ఫున‌ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని కోరారు. ఈ మేర‌కు జ‌గ‌న్ ఓ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.

శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని ప్రజలంతా ఆశించారని అయితే ఐదు కోట్ల ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారని జ‌గ‌న్ ఆ లేఖ‌లో పేర్కొన్నారు. మోడీ వస్తారు, చంద్రబాబు ఒత్తిడి తెస్తారని అనుకున్నార‌ని అయితే... ప్ర‌ధాని వచ్చారు, పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని, యమునా నది నుంచి కూడా నీళ్లు తెచ్చారే త‌ప్ప మరేమీ తేలేద‌ని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ స్పెష‌ల్ స్టేట‌స్ లేదా ప్యాకేజీపై ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేద‌ని జ‌గ‌న్ ఆక్షేపించారు. ప్ర‌ధాన‌మంత్రి స్పందించ‌క‌పోయినా ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఈ విష‌యాన్ని గుర్తుచేయాల్సిన బాధ్య‌త ఉంద‌ని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. తనపై ఉన్న‌ కేసుల నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను చంద్రబాబునాయుడు అమ్మేశారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనను ప్ర‌ధాన‌మంత్రికి, ఏపీ సీఎం చంద్రబాబుకు తెలియ‌జెప్పేందుకు  రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తెలపాలని వైఎస్ జగన్  ఈ లేఖ ద్వారా పిలుపునిచ్చారు. ప్ర‌త్యేక హోదా ఇన్నాళ్లు న‌ర్మ‌గ‌ర్భ విమ‌ర్శ‌లు చేసిన జ‌గ‌న్ తాజాగా ప్ర‌ధాన‌మంత్రి మోడీ పేరుపెట్టి విమ‌ర్శ‌లు చేయ‌డం ఆస‌క్తిని సంతరించుకుంది.
Tags:    

Similar News