జ‌గ‌న్ ఫైర్:సీఎం చొక్కా..ఆ మంత్రి నిక్క‌రు విప్పుతా!

Update: 2017-08-14 07:54 GMT
మాట‌లు తూటాల్లా పేలుతున్నాయి. ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా అధికార‌.. ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ఇరు వ‌ర్గాల మ‌ధ్య న‌డుస్తున్న మాట‌ల యుద్ధంలో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో చంద్ర‌బాబు చేసిన హామీలు..గ‌డిచిన మూడున్న‌రేళ్ల కాలంలో బాబు పాల‌న‌ను చాకిరేవు పెట్టి మ‌రీ మాట‌ల‌తో ఉతికేస్తున్న వైనం ఏపీ తెలుగు త‌మ్ముళ్ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ప్ర‌చారం అంటే వ‌చ్చామా?  నాలుగు మాట‌లు మాట్లాడి వెళ్లామా? అన్న చందంగా కాకుండా ప్ర‌తి విష‌యాన్ని సునిశితంగా స్పృశిస్తూ..ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని ఎత్తి చూపిస్తున్న జ‌గ‌న్ మాట‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి తోడు ధ‌ర్మాగ్ర‌హంతో ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు ప‌లువురు దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. గ‌డిచిన ఐదు రోజులుగా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్న జ‌గ‌న్‌.. ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డిన జ‌గ‌న్‌.. కేశ‌వ‌రెడ్డి స్కూల్స్ వ్య‌వ‌హారంలో విద్యార్థుల త‌ల్లిదండ్రుల్ని ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుల్ని పిల్ల‌ల చ‌దువుల కోస‌మ‌ని త‌ల్లిదండ్రులు దాదాపు రూ.850 కోట్లకు పైనే కేశ‌వ‌రెడ్డి స్కూల్స్ లో డిపాజిట్‌ చేస్తే.. ఆ డ‌బ్బును ఎగ్గొట్టార‌ని.. దీనికి బాబు త‌న ద‌గ్గ‌రి సీఐడీని విచార‌ణ‌కు ఆదేశించార‌న్నారు. సీబీఐ విచార‌ణ‌కు ఎందుకు ఆదేశించ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

రానున్న ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని.. కేశ‌వ‌రెడ్డి.. ఆగ్రిగోల్డ్ బాధితుల‌కు త‌మ ప్ర‌భుత్వం నుంచే డ‌బ్బులు అందుతాయంటూ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏడాది ఆగితే త‌మ ప్ర‌భుత్వం రావ‌టం ఖాయ‌మ‌న్న ఆయ‌న‌.. ఆ త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు చొక్కా.. మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి నిక్క‌రు విప్పుతానంటూ తీవ్రంగా మండిప‌డ్డారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌మ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపారు కాబ‌ట్టే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు క‌మ్ మంత్రి లోకేశ్ లు నంద్యాల‌కు వ‌చ్చార‌ని.. లేకుంటే వ‌చ్చేవారా? అని ప్ర‌శ్నించారు. రోడ్డుకు రెండుప‌క్క‌ల ఇష్టానుసారం కిలోమీట‌ర్ల మేర భ‌వ‌నాలు తొల‌గిస్తే దాన్ని అభివృద్ధి అంటారా? అని నిల‌దీసిన జ‌గ‌న్‌.. రోడ్ల విస్త‌ర‌ణ జ‌రుగుతున్న తీరును త‌ప్పు ప‌ట్టారు. జ‌నాభా పెరుగుతున్న కొద్దీ రోడ్ల‌ను విస్త‌ర‌ణ చేయాల్సిందేన‌ని.. అయితే.. నంద్యాల‌లో మాత్రం అడ్డంగా భ‌వ‌నాలు ప‌గ‌ల‌గొట్టించార‌న్నారు. రోడ్ల విస్త‌ర‌ణ స‌మ‌యంలో భ‌వ‌నాలు కోల్పోయిన వారికి సెంటుకు రూ.18వేలు ఇస్తామ‌న్నార‌ని.. వాస్త‌వానికి నంద్యాల‌లో సెంటు రూ.5లక్ష‌ల‌కు పైనే ఉంద‌న్నారు. రోడ్ల విస్త‌ర‌ణ‌లో ఇళ్లు.. భ‌వ‌నాలు కోల్పోయిన వారికి తాము అండ‌గా నిలుస్తామ‌న్నారు. 300 చ‌ద‌ర‌పు అడుగుల్లో క‌ట్టించి ఇచ్చే ప్లాట్ కు అడుగుకు రూ.1000 కూడా కాద‌ని.. ఆ లెక్క‌న రూ.3ల‌క్ష‌ల‌కు క‌ట్టించాల్సిన ఫ్లాట్‌ను రూ.6ల‌క్ష‌ల‌కు నిర్మిస్తున్నార‌ని మండిప‌డ్డారు.ఈ లెక్క‌ల‌న్నీ పెద్ద స్కామ్ గా జ‌గ‌న్ అభివ‌ర్ణించారు.


Tags:    

Similar News