జగన్ తెలుగు... చీఫ్ జస్టిస్ ఇంటరెస్టింగ్ కామెంట్

Update: 2022-08-20 08:30 GMT
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడుతారు. అందులో పాశ్చాత్య యాసను కూడా ఆయన చేర్చి అచ్చం విదేశీయులు మాట్లాడినట్లుగానే ఆంగ్ల పదాల‌ను పలుకుతారు. ఇక ఆయన  ఇంగ్లీష్ పదబంధాలు కూడా గంభీరంగా ఉంటాయి. తేలికపాటు పదాలు ఆయన వాడేవాడరు. అది తనకు భష మీద ఉన్న పట్టు అని ఆయన అలా రుజువు చేసుకుంటారు. జగన్ ఏమి చదివారు అన్న ప్రశ్న వేసే వారికి ఆయన ఇంగ్లీష్ చూస్తే శభాష్ అనక తప్పని పరిస్థితి. ఇదిలా ఉంటే జగన్ రాజకీయాల్లోకి వచ్చాక ప్రజల వద్ద మాత్రం తెలుగే మాట్లాడుతూ వస్తున్నారు.

ఆయన తెలుగులో కొన్ని పదాలను సరిగ్గా పలకలేక ఇబ్బంది పడినా కూడా తెలుగుకే అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఇదిలా ఉంటే విజయవాడలో నూతన కోర్టు భవనాల ప్రారంభోత్సవం వేళ జరిగిన సభలో ఒక విశేషం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న వారంతా న్యాయమూర్తులు, న్యాయవాదులు, మేధావులు.  దాంతో అంతా ఆంగ్లంలోనే మాట్లాడారు. ఇక ముఖ్యమంత్రి జగన్ వంతు వచ్చింది.

ఆయన కూడా సాధారణంగా ఇంటలెక్చువల్స్ ఉన్న సభలలో ఆంగ్లంలోనే మాట్లాడుతూ ఉంటారు. అయితే దానికి భిన్నంగా ఈసారి జగన్ తెలుగులో మొదలుపెట్టి తెలుగులోనే ముగించడం విశేషం. మరి అక్కడ ఉన్నది సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఆయన జగన్ తెలుగు మాట్లాడుతూంటే అలా వింటూ ఆనందించారు.

ఆ మీదట ఆయన తన ప్రసంగాన్ని కూడా తెలుగులోనే కొనసాగించారు. దానికి ఆయన చెప్పిన కారణం ముఖ్యమంత్రి జగన్ తెలుగులో మాట్లాడారు, నేను కూడా తెలుగులోనే మాట్లాడకపోతే బాగుండదు కదా అని చమత్కరించి మరీ చక్కని తెలుగులో మాట్లాడారు. ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు భాషాభిమాని. అలాగే సాహిత్యాభిమాని. ఆయనకు తెలుగు మాట్లాడేవారు అంటే మక్కువ.

పైగా అత్యున్నత స్థానం అధిరోహించిన ఆయన మన తెలుగువారు కావడం గర్వకారణం. అలాంటి చీఫ్ జస్టిస్ తెలుగు నేల నడిబొడ్డున తెలుగు మాట్లాడకుండా ఉండగలరా. ఆయన పలు సభలలో తన ప్రసంగాలలో ఎపుడూ తెలుగు మాట్లాడండి అంటూ అందరికీ పిలుపు ఇస్తారు. ఇక ఏపీలో ఆంగ్ల మాధ్యామంలో బోధనకు వైఎస్సార్ కాంగ్రెస్ సర్కార్ పచ్చ జెండా ఊపింది. దాని మీద ఎంతో వివాదం కూడా నడచింది.

ఆ సంగతి అలా ఉంటే జగన్ కూడా తెలుగులో మాట్లాడడంతో తెలుగు భాషకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నది  అన్యాపదేశంగా చీఫ్ జస్టిస్  సూచించి ఉంటారు అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా జగన్ తెలుగు మాత్రం చీఫ్ జస్టిస్ ని ఆకట్టుకుందనే చెప్పాలి.
Tags:    

Similar News