దేశంలో ఏ సీఎం చేయని గొప్ప పని చేసిన జగన్

Update: 2019-12-11 06:04 GMT
అధికారం కోసం వంద మాటలు చెపుతారు.. ఎన్నికల వేళ రాజకీయ నేతలు ఊదర గొట్టే ప్రసంగాలు ఎన్నో చేస్తారు. కానీ ప్రసంగించడమే కాదు.. మాట మీద నిలబడే నేతలు తక్కువ మంది ఉంటారు.. ఆ కోవలోకే వస్తున్నారు ఏపీ సీఎం జగన్.

తన నాన్న వైఎస్ఆర్ లాగానే.. రైతు పక్షపాతిగా తాను గద్దెనెక్కినప్పటి నుంచే నిరూపించుకుంటున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఏపీ రైతుల కు రైతు భరోసానిచ్చారు. అయితే పంటలు పండించే రైతుకు ఇప్పుడు దేశం లో మద్దతు ధర కరువైంది. మహారాష్ట్రలో ఉల్లి సంక్షోభం తో ధరలు పెరిగి పోయాయి. పోయిన సంవత్సరం ఇదే మహారాష్ట్రలో ఉల్లికి గిట్టుబాటు ధర లేదని రోడ్లపై రైతులు పారబోసిన పరిస్థితి. ఇప్పుడేమో కిలో 200 పలుకుతున్న పరిస్థితి. రైతుల కు గిట్టుబాటు ధర ఇచ్చి వాటిని నిల్వ చేస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దేశంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర విషయం లో మీనమేషాలు లెక్కిస్తోంది.

ఇక ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర లోనూ టమాటల కు మద్దతు ధర లేదని రైతులు రోడ్ల పైనే పారబోస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏపీ లో రాకూడదని.. ఈ వర్షాలతో అధిక దిగుబడులతో పంటకు మద్దతు ధర లభించడం లేదని సీఎం జగన్ తెలుసుకొని ఏకంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతుల పక్షపాతి గా నిరూపించుకున్నారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే పంటలను కొంటుందని జగన్ అసెంబ్లీ లో ప్రకటించారు. అన్ని పంటలను రైతులు గిట్టుబాటు ధరకే అమ్మాలన్నదే తమ ఆశయం అని.. ఏం పంటకు ఎంత అనేది పత్రికల్లో ప్రకటనలు ఇస్తామని జగన్ తెలిపారు.

అంతే కాదు రైతుల కు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు జగన్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా రైతుల కోసం జగన్ చేసిన ఈ పని ప్రశంసలు అందుకుంది. అంతేకాదు.. రైతులకు సమస్యల పై  టెలిఫోన్ నంబర్ ను కూడా ప్రవేశ  పెడుతున్నట్టు ప్రకటించి జగన్ సంచలనం రేపారు.

- Dinakar
Tags:    

Similar News