బద్వేలులో గెలుపుకు జగన్ మూడంచెల వ్యూహం

Update: 2021-10-03 10:30 GMT
ఎన్నిక ఏదైనా సరే జాగ్రత్తగా వ్యూహాలు పన్నడం, అంతే జాగ్రత్తగా వ్యూహాలను అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆదేశించారు. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు కోసం జగన్ మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూడంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ఉపఎన్నిక ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చెప్పినట్లు సమాచారం. నిజంగానే జగన్ వ్యూహం గనుక చెప్పింది చెప్పినట్లు అమలైతే ప్రత్యర్ధిపార్టీలకు డిపాజిట్లు కూడా దక్కే అవకాశాలు లేవని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు.

ఇంతకీ జగన్ చెప్పిన మూడంచెల వ్యూహం ఏమిటంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్+మండలాలు+గ్రామస్ధాయిలో ఏకకాలంలో పార్టీ ప్రచారంలోకి దిగాలని జగన్ చెప్పారు. ప్రచారం చేయటమే కాకుండా పోలింగ్ రోజున నేతలు ఓటింగ్ శాతం పెరగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా చెప్పారట. నిజానికి ఎన్నికల సమయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే విషయంలో మంత్రులకు ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరంలేదు.

సాధారణ ఎన్నికైనా , ఉపఎన్నికైనా మంత్రులు నిర్లక్ష్యంగా ఉండద్దని చెప్పటానికే జగన్ ఇంతగా చెప్పాల్సొచ్చింది. హెడ్ క్వార్టర్స్ లో మున్సిపల్ ఛైర్మన్+కౌన్సిలర్లకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించాలని జగన్ ఆదేశించారు. అలాగే మండలాల్లో జడ్పీసీలు, ఎంపీటీసలతో పాటు మండల పరిషత్ అధ్యక్షులపై ఎక్కువ బాధ్యతలు పెట్టమని చెప్పారట. చివరగా గ్రామస్ధాయిలో సర్పంచ్ ల పైన బాధ్యత మోపారట.

ఓవర్ ఆల్ ఇన్చార్జిగా మంత్రి పై ఎత్తున తిరుగుతూ ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహిస్తున్నది లేనిది చూడమని చెప్పారు. ఎలాగూ సమన్వయం కోసం మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు అదనంగా ఉంటారు. అంటే ఉపఎన్నికలో అనుసరించబోయే వ్యూహంతో ప్రతిపక్షాలకు ఊపిరాడకుండా అన్నీవైపుల నుండి గట్టిగా బిగించేయాలనేది జగన్ వ్యూహం. మరి జగన్ వ్యూహం గనుక చెప్పింది చెప్పినట్లు అమలైతే ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.
Tags:    

Similar News