జగనే ముఖ్యమంత్రి... న్యూమరాలజీ

Update: 2018-08-07 06:35 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అనేది శాస్త్రాలు తేల్చే పనిలో పడ్డాయి. ఎన్నికల సమయం దగ్గర పడతూండడంతో జాతక కర్తలు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, భవిష్య వాణి చెప్పేవారు తమ రాతలకు, వ్యాఖ్యలకు తలుపులు తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సారి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి  కావడంఖాయమంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. జగన్ పేరులో మూడు అక్షరాలున్నాయని, అవి జెఎమ్మార్ అని,  ఇలా మూడు అక్షరాలు ఉన్న నాయకులు గతంలో దేశంలో అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేశారని అంటున్నారు. వారి వాదనకు బలం చేకూరేలా వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి పేర్లను కూడా హ్యుమరాలజిస్టులు ప్రస్తావిస్తున్నారు.  వై.ఎస్.జగన్ కూడా ఆ ముఖ్యమంత్రుల జాబితాలోకి వస్తారంటున్నారు. అయితే కొద్దిపాటి మార్పులు అవసరమని, ఇప్పటి వరకూ అందరూ వ్యవహరించినట్లుగా జగన్ అని కాకుండా ఆయన పేరులోని మొదటి మూడు ఇంగ్లీషు అక్షరాలను కలిపి జెెఎంఆర్ అని వ్యవహరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని సంఖ్యాశాస్త్ర నిపుణుల పేర్కొంటున్నారు.

కాంగ్రెస్  పార్టీలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావడానికి చాలా కాలం పట్టింది. ఆయన తన పేరులో మొదటి మూడు అక్షరాలను కలుపుకుని వైఎస్ఆర్ అని పిలిపించుకోవడం ప్రారంభించిన తర్వాతే ఆయనకు అద్రష్టం వరించింది.  ఇలా తన పేరును మూడు అక్షరాల్లోకి మార్చుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రిగాపదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కూడా ఉద్యమ సమయంలో కెసిఆర్ గా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన మహానటుడు, దిగ్గజ రాజకీయ నాయకుడు ఎన్.టి .రామారావు తన పేరు ఎన్టీఆర్‌గా పిలుపించుకోవడం ప్రారంభించిన తర్వాతే ఆయనకు అటు సినీరంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ కలిసొచ్చిందంటున్నారు. తమిళనాడులో మహానటుడు - ముఖ్యమంత్రి ఎం.జి..రామచంద్రన్ కూడా ఎంజీఆర్ గా పిలిపించుకునే వారు. చాలా మంది దీన్ని వ్యతిరేకించినా ఆయన మాత్రం ఎంజీఆర్ పేరుకే ఇష్టపడేవారు. ఆ తర్వాత కొన్నాళ్లుకు ఎంజీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.  ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన పేరును పొడి అక్షరాలతో జెఎంఆర్ అని మార్చుకుంటే విజయం వరిస్తుందేమో చూడాలి. చూద్దాం ఏ శాస్త్రంలో ఏముందో... !!!


Tags:    

Similar News