నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. అధికారంలోకి రాగానే.... తన సింప్లిసిటీ ఏమిటో చూపించేస్తున్న జగన్... తన ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా నిర్వహించినా.. దుబారా లేకుండా కేవలం రూ.29 లక్షలతో ముగించేసి ఔరా అనిపించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్... అక్కడ కూడా తనదైన సింప్లిసిటీని చూపించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన జగన్ అక్కడికి సమీపంలోని మెట్రో రైల్వే స్టేషన్ కు వెళ్లిన జగన్... మెట్రో రైలెక్కి పార్లమెంటుకు చేరుకున్నారు.
సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినా హంగూ ఆర్భాటం లేకుండా చాలి సింపుల్ గా మెట్రో ఎక్కిన జగన్ పార్లమెంటు దాకా రైల్లోనే ప్రయాణించడం చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తోందని చెప్పక తప్పదు. ఇప్పటికే విజయవాడలో తన కాన్వాయ్ కారణంగా జనానికి ఇబ్బంది లేకుండా చూడాలంటూ ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. జనానికి ఇబ్బంది లేని రూటును ఎంపిక చేయాలని - తన కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ చిక్కులు లేకుండా చూడాలని జగన్ చేసిన ఆదేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో కూడా ఎలాంటి ఆర్భాటం లేకుండా సాగిన జగన్ చాలా సింపుల్ గా మెట్రో రైలెక్కి పార్లమెంటు చేరుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.