పెద్ద నోట్ల రద్దుతో జగన్ వంటి కుబేరులకు షాక్ అంటూ చంద్రబాబు అనుకూల మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే... రాజకీయ విశ్లేషకులకు మాత్రం ఈ నిర్ణయం జగన్ పాలిట వరమని అంటున్నారు. జగన్ కు అధికారం అందుకోవడానికి ఇది మరో మెట్లని చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ సీఎం చంద్రబాబుకు అగ్నిపరీక్ష మొదలు కానుందని చెబుతున్నారు.
జగన్ తన పత్రిక నెట్ వర్కు సహాయంతో ఈ నోట్ల రద్దు అంశంపై జనం నాడి తెలుసుకున్నారట. ఈ నిర్ణయంపై జనం మండిపడుతున్నారని ఫీడ్ బ్యాక్ వచ్చింది. నోట్ల రద్దును వ్యతిరేకించేవారిని నల్ల కుబేరులని.. అక్రమార్కులని.. చివరికి దేశద్రోహులు అని కూడా అనేంతగా ఈ నిర్ణయానికి పాజిటివ్ ప్రచారం చేస్తున్న తరుణంలో బహిరంగంగా ఎవరూ వ్యతిరేకించకపోయినా లోలోన మాత్రం రగిలిపోతున్నారు. ముఖ్యంగా రైతుల్లో బాగా ఆగ్రహం ఉంది. పల్లెల్లో రైతులు చాలావరకు నగదు రూపంలో దాచి పెడతారు. వారంతా ఇప్పుడు సమస్య ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ప్రభుత్వం చెబుతున్న 3 లక్షలు దాటి డిపాజిట్ చేసినా మరింత కష్టం రానుంది.
ఇదే సమయంలో ప్రత్యేక హోదా కారణంతో రాజీనామాలు చేస్తే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం తమకు అనుకూలమవుతుందన్న కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ప్రత్యేక హోదా కోరుతూ రాజీనామా చేస్తే అదే లక్ష్యంతో పార్టీని జనంలోకి తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ కూడా మద్దతివ్వక తప్పని పరిస్థితి. జగన్ ఇప్పుడు ఇదే రాజకీయ వ్యూహం రచించినట్లుగా చెబుతున్నారు.ఏప్రిల్ - మేల్లో ఎన్నికలు వచ్చేలా జగన్ తన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/