విశాఖ వాసుల మనసు దోచేసిన జగన్ వీడియో

Update: 2019-12-29 04:52 GMT
విశాఖ ఉత్సవ్ లో పాల్గొనేందుకు ఏపీ సీఎం విశాఖపట్నానికి వచ్చారు. ఏపీలో మూడు రాజధానుల ప్రకటన తర్వాత తొలిసారి విశాఖకు వచ్చిన ఆయనపై విశాఖవాసులు తమ ప్రేమాభిమానాల్ని ప్రదర్శించారు. కిలోమీటర్ల కొద్దీ విశాఖ వాసులు రోడ్ల మీదకు వచ్చి వెయిట్ చేయటమే కాదు.. జగన్ కాన్వాయ్ మీద పూల వర్షం కురిపించిన తీరు చూస్తే.. రాజధాని వైజాగ్ లో వస్తుందేమో అన్న మాటకు అక్కడి వారి నుంచి వచ్చిన స్పందనగా చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే.. విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన వేదిక మీదన ఒక షార్ట్ వీడియోను ప్రదర్శించారు. రోటీన్ కు భిన్నంగా ఒక ప్రయోగంగా వీడియోను ప్రదర్శించారు. సాధారణంగా వీడియోల్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు తెర మీదనో.. డిజిటల్ స్క్రీన్ మీదనే ప్రదర్శిస్తారు. అందుకు భిన్నంగా జగన్ నిలువెత్తు కటౌట్ మీద ఆ వీడియోను ప్లే చేశారు.

ఈ వీడియోలో విశాఖ నగర చరిత్ర.. డెవలప్ మెంట్ గురించి మాత్రమే కాదు.. వేల కిలోమీటర్లు నడిచి.. ప్రజల బాధల్ని.. కష్టాల్ని తెలుసుకునే పాదయాత్రను ప్రదర్శించారు. అందరి సంక్షేమాన్ని కాంక్షించే నేతగా పేర్కొన్న వీడియో అందరిని ఆకర్షించింది. మరి.. ముఖ్యంగా విశాఖ అంటే జగన్ కున్న ప్రత్యేక ప్రేమాభిమానాల్ని ప్రదర్శించిన వైనానికి స్పందన వచ్చింది. పేదల్ని.. పిల్లల్ని జగన్ ముద్దాడే సన్నివేశాలకు ప్రజల నుంచి భారీ స్పందన రావటం గమనార్హం.


Full View
Tags:    

Similar News