ఎమ్మెల్యే లైంగిక వేధింపులు.? సీఎంకు ఫిర్యాదు.!?

Update: 2019-07-10 17:30 GMT
ఓ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రకాశం జిల్లాలోని ఒక ఎమ్మెల్యే.. తన పార్టీ క్యాడర్ లో ఉన్న మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పనికోసం వచ్చిన ఆ మహిళను తన దగ్గరకు వచ్చి పనిచేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం గుప్పుమంది... నువ్వే నా పని చూడు అని వేధిస్తున్నాడని ఆడియో రికార్డులు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీలోని ఆ మహిళను లొంగదీసుకునేందుకు పెద్ద పదవి ఇప్పిస్తానని .. ఆమె భర్తకు ప్రమోషన్ ఇప్పిస్తానని ఓ ఎమ్మెల్యే వేధించినట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అవసరం లేకున్నా ఇంటికి పిలిపించుకొని సమయం ఇచ్చి సంబంధం లేని మాటలు మాట్లాడుతూ    గత 15 రోజుల నుంచి వేధింపులకు గురిచేస్తున్నాడని ఆనోట ఈనోటా అదీ బయటకు రావడం కలకలం రేపుతోంది.

తాజాగా సదురు ఎమ్మెల్యే బాధిత మహిళ సీఎం జగన్ కు ఒక లేఖ రాసిందన్న ప్రచారం సాగుతోంది... ఎమ్మెల్యే తనతో అసభ్యంగా మాట్లాడిన ఫోన్ రికార్డ్స్ కూడా అంతా మొత్తం ఆధారాలను జగన్ కు సమర్పించిందన్న సచివాలయ వర్గాల ద్వారా టాక్ వినిపిస్తోంది. ఆమె గత 10 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తుంటే ప్రభుత్వంలో ఒక పదవి ఇవ్వండి అని అడిగిన పాపానికి తనను మానసికంగా వేధిస్తున్నాడని పూర్తి వివరాలతో లేఖ సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు పంపించిందన్న చర్చ   సాగుతోంది. ఒకవేళ మీరు సదురు ఎమ్మెల్యేపై చర్య తీసుకోకుంటే నాకు చావే శరణ్యం అని చనిపోతానని పేరు పెట్టి చనిపోతానని లేఖలో పేర్కొన్నట్టు వార్తలు లీక్ అయ్యాయి.

నిన్న సీఎం ఆ ఎమ్మెల్యే ను పిలిపించుకొని క్లాస్ పీకి ఇలా ఇంకొక్కసారి చేస్తే నీ మీద చర్య తీసుకుంటానని బెదిరించాడని  చర్చ జరుగుతోంది... దీనికి సదురు ఎమ్మెల్యే తాను అలా చేయలేదని బుకాయించాడని.. కానీ జగన్ ఫొన్ రికార్డ్ వినిపించేసరికి ఖిన్నుడయ్యాడని సమాచారం.. దీంతో దిమ్మదిరగడం సదురు ఎమ్మెల్యే వంతైందని గుసగుసలు వినిపిస్తున్నాయి..

ఇలా జగన్ తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డా ఉపేక్షించకుండా ఉతికేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ ఎమ్మెల్యే ఎవరనేది ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News