అన్నం ఉడికిందా లేదా? అన్నది తెలుసుకోవటానికి మొత్తం కెలకాల్సిన పని లేదు. ఒక్క మెతుకును పట్టుకుంటే విషయం అర్థమైపోతుంది. ప్రజాధనాన్ని ఆర్భాటాల కోసం ఖర్చు చేయకుండా.. ఆచితూచి అన్నట్లుగా ఖర్చు చేయాల్సిన గురుతర బాధ్యత పాలకుల మీద ఉంటుంది. అయితే.. అలాంటివేమీ పట్టించుకోకుండా ప్రజల సొమ్మును మంచినీళ్ల కంటే దారుణంగా ఖర్చు చేసేస్తున్న తీరు ప్రజాగ్రహానికి కారణమవుతుంది.
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. చంద్రబాబు జమానాలో ఆర్భాటాల కోసం.. సోకు కోసం పెట్టిన ఖర్చు అంతా ఇంతా కాదు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుందే ఇలాంటివాటికి తన దగ్గర నడవవని తేల్చేసిన జగన్.. సింఫుల్ గా ఉంటున్నారు. తాజాగా తిరుపతికి వచ్చిన ప్రధాని మోడీకి తానేమిటన్న విషయాన్ని.. ఖర్చు విషయంలో తన తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని తన చర్యతో చెప్పకనే చెప్పేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
సాధారణంగా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలికే క్రమంలో భారీ బొకేల.. పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వటం ఒక అలవాటుగా ఉండేది. అందుకు భిన్నంగా తాజాగా బొకేలను బంద్ చేసి సింగిల్ గులాబీని ముచ్చటగా చేతికి ఇచ్చిన వైనం కొత్తగా ఉండటమే కాదు.. అనవసర ఖర్చుకు ఎలా కళ్లెం వేస్తానన్న విషయాన్ని మోడీకి జగన్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
ఏపీ లాంటి ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రం ఎలా ఉండాలని మోడీ కోరుకుంటారో.. అదే తీరులో జగన్ తీరు ఉండటం ఆయన మనసును దోచేసేసుకోవటమే కాదు.. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించే విషయంలో మరింత పాజిటివ్ గా ఉండేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయన్న వాదన వినిపిస్తోంది. తానొక్కరేకాదు.. మోడీకి స్వాగతం పలికేందుకు వచ్చిన వారంతా సింగిల్ గులాబీలతో వెల్ కం చెప్పిన తీరు సరికొత్తగా ఉందని చెప్పాలి.