జగన్ టార్గెట్ కుప్పం.. చంద్రబాబుకు షాకిచ్చేందుకు వ్యూహం

Update: 2020-03-10 16:30 GMT
అధికారం లో తనను ఎంత వేధించారో.. అంతకంతకు ప్రతీకారం తీర్చుకునే పనిలో ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అధికారంలోకి వచ్చి రాగానే టార్గెట్ చంద్రబాబు అయ్యారు. దీంతో చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించేలా ప్రస్తుత జగన్ పాలన సాగుతోంది. అయితే ఇఫ్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం లో అధికార పార్టీ సరికొత్త వ్యూహంతో వెళ్తోంది. ఇటీవల ప్రజాచైతన్య యాత్రలో చంద్రబాబు పర్యటనకు అడ్డు తగిలేలా చేసినా వైఎస్సార్సీపీ ఇప్పుడు చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గం లో షాకిచ్చేలా చర్యలు చేపట్టింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు జగన్ సొంత జిల్లా లో ఓడించాడు. అందుకే ప్రతీకారం తో ఇప్పుడు కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందను ఓడించి టీడీపీ బలం నిరూపించుకుంది. ఆ సమయంలో టీడీపీ నుంచి బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలవగా టీడీపీ నాయకులు సొంత జిల్లాలోనే తన బాబాయ్ నే గెలిపించుకోలేని జగన్ ఒక నాయకుడా అని టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. తన సొంత జిల్లాలో తన బాబాయ్ ఓడిపోవడం జగన్ కూడా జీర్ణించుకోలేకపోయాడు. అప్పటి ప్రతీకారాన్ని స్థానిక ఎన్నికల రూపంలో జగన్ తీర్చుకోనున్నాడు. టీడీపీ కి కంచుకోటగా ఉన్న కుప్పంలో స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని వైఎస్సార్సీపీ పట్టుదలతో వెళ్తోంది. జగన్ ప్రత్యేకంగా వ్యూహం రచించారు.

కుప్పం నియోజకవర్గ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్పకు జగన్ అప్పగించారు. దీంతో వారిద్దరూ ఇప్పటికే కుప్పం పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక మొదలుపెట్టారంట. వారిని గెలిపించుకునే జగన్ వద్దకు వెళ్తారని తెలుస్తోంది. దీంతో వారి గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే ప్రజాచైతన్య యాత్ర లో చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించేలా వైఎస్సార్సీపీ ప్రణాళిక వేసింది. దీన్ని గుర్తించిన చంద్రబాబు తన నియోజకవర్గంపై పట్టు కోల్పోకుండా ప్రతి వ్యూహం సిద్ధం చేశారు. పార్టీ కో ఆర్డినేటర్లు, చిత్తూరు జిల్లా నాయకులంతా కుప్పం నియోజకవర్గంపైనే ప్రత్యేక ప్రణాళిక రచించారంట. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News