తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా ఇరకాటంలో పడేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓయూలో బహిరంగ సభలు నిర్వహించవద్దని ఇటీవల ఓయూ అధికారులు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు(ఓయూ)లో అడుగు పెట్టే ధైర్యం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవహార శైలి ఓయూ విద్యార్థులపై కక్ష కట్టినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. విద్యార్థులను అణచివేసేందుకే ఓయులో నిషేదాజ్ఞల జీవో ను జారీ చేశారని జగ్గారెడ్డి అన్నారు.
ఓయూలో విద్యార్థుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అప్పుడు అవసరమైన విద్యార్థులు ఇప్పుడు అవసరం లేదా అని జగ్గారెడ్డి నిలదీశారు. ఓయూలో బహిరంగ సభలు - సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించడం దుర్మార్గమని అన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓయూలో సభ నిర్వహిస్తే పాల్గొంటారని వెల్లడి కావడంతోనే నిషేదాజ్ఞలు విధించారని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు సీఎం కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం నిర్వహించి తీరుతామని జగ్గారెడ్డి ప్రకటించారు. అక్కడే కేసీఆర్ పరిపాలన వైఫల్యాలు బయటపెట్టి ఆయన సంగతి తేలుస్తామన్నారు. ఓయూ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/