కేసీఆర్‌..నా స‌త్తా ఏంటో చూపిస్తా నీకు

Update: 2018-09-24 18:25 GMT
గెల‌వ‌లేనోడు... గెలిచే వాడికి అడ్డు ప‌డ‌తాడు... కేసీఆర్ రాజ‌కీయం అదే. ఇది కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి మాట‌. ఎల‌క్ష‌న్ ముందు అరెస్టుతో కాంగ్రెస్ బ‌ల‌హీన ప‌డుతుంద‌ని టీఆర్ ఎస్‌.. దానిని ప‌దే పదే చూపి సానుభూతి పొందాల‌ని కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో ఎవ‌రికి వారే ముందుకు అడుగులు వేస్తున్నారు. తాజాగా జ‌గ్గారెడ్డి ఈ ఇష్యూపై మీడియాకు ఎక్కే ప్ర‌య‌త్నం చేశారు.

 ప్ర‌భుత్వం చేసే త‌ప్పుల‌ను ప్ర‌శ్నించినందుకు -  అవినీతిని క‌డిగేసినందుకు బ‌ల‌మైన కాంగ్రెస్ నేత‌ల మీద కేసీఆర్‌ స‌ర్కారు కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఆయ‌న ఈ సాయంత్ర‌మే బెయిలుపై విడుద‌ల అయ్యారు. ఆ వెంట‌నే గాంధీ భ‌వ‌న్‌ కు వ‌చ్చి మీడియాతో మాట్లాడారు.

 జ‌గ్గారెడ్డి చేసిన త‌ప్పు... ప్రజల కష్టాలు తెలుసుకోవడమేనా? కేసీఆర్ పెట్టిన రాజ‌కీయ కేసు ఇది. ప‌ద్నాలుగేళ్ల నాటి కేసును ఇపుడు త‌వ్వారు. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్ల‌య్యింది. మ‌రి ఇంత‌కాలం ఏం చేశారు. దీన్ని బ‌ట్టి... ఎన్నిక‌ల ముందు క‌క్ష సాధింపు - బెదిరింపు మిన‌హా ఇది మరేం కాద‌ని జగ్గారెడ్డి విమ‌ర్శించారు. సంగారెడ్డిలో టీఆర్ ఎస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్ప‌డ‌టంతో ఏం చేయాలో పాలుపోక అస‌లు ఈ జగ్గారెడ్డినే లోప‌లేస్తే స‌రిపోతుంది క‌దా అని ఈ కేసును తిర‌గ‌తోడారు. కేవ‌లం త‌మ పార్టీని సంగారెడ్డిలో బ‌తికించుకోవ‌డం కోస‌మే కేసీఆర్ ఈ ప‌ని చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

కేసీఆర్ అస‌లైన జ‌గ్గారెడ్డిని చూడ‌లేదు.... కేసీఆర్‌కు ఇకపై తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు. ప్ర‌జాస్వామ్య‌పు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా ? అహంకార‌పూరిత‌ నియంత కేసీఆర్ ప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకుని తీర్పు ఇవ్వాలన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ జీవితంలో ఏ తప్పూ చేయలేదా... కొన్నేళ్ల క్రిత‌మే వీటిని బ‌య‌ట‌కు తీస్తే కేసీఆర్ గుట్టు ర‌ట్టు అవుతుంద‌ని స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు తీశార‌ని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News