ఈసీపై ఒంటికాలిపై లేచిన జగ్గారెడ్డి

Update: 2019-12-25 09:05 GMT
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే టీఆర్ ఎస్ కార్యకర్తల ఫేస్ బుక్ లోకి వచ్చేసిందంటూ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ పూర్తిగా టీఆర్ ఎస్ పార్టీకి కొమ్ము కాస్తోందంటూ ఆరోపించారు.

ఈసీ నాగిరెడ్డి ఎన్నికల అధికారా? లేక టీఆర్ ఎస్ కార్యకర్తనా అంటూ ప్రశ్నించారు.మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై జగ్గారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈసీ - పోలీస్ వ్యవస్థలు అధికార టీఆర్ ఎస్ పార్టీని కాపాడుతున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. పండుగల సమయంలో ఈ ఎన్నికలు నిర్వహించడంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో కలిసి కోర్టులో ఇంటా బయటా పోరాడుతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


Tags:    

Similar News