టీఆర్ఎస్ లో జర్నీ చేసి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన నేతల్లో జగ్గారెడ్డి ఒకరు. కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న ఆయన.. తర్వాతి కాలంలో కాంగ్రెస్ లోకి రావటం తెలిసిందే. కేసీఆర్ మీద అవకాశం వచ్చిన ప్రతిసారీ ఘాటు విమర్శలు చేసే జగ్గారెడ్డి.. తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన ఈటల రాజేందర్ ఇష్యూ మీద ఆయన తనదైన శైలిలో రియాక్టు అయ్యారు. త్వరలో బీజేపీలోకి ఈటల ఎంట్రీ ఇవ్వనున్న వేళ.. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలో ఉండి.. హోం శాఖ కాంగ్రెస్ పార్టీ నేత చేతిలో ఉండి ఉంటే.. ఈటల కచ్ఛితంగా కాంగ్రెస్ లో చేరే వారన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ కు కేంద్ర హోంశాఖ.. ఈడీ.. ఆదాయపన్నుశాఖలతో సహాయం అవసరమని.. అవన్నీ కాంగ్రెస్ వద్ద లేకపోవటంతోనే ఆయన కాంగ్రెస్ లో చేరలేదన్నారు. అయితే.. ఈటల కంటే కూడా కాంగ్రెస్ చాలా బలమైనదన్నారు.
కేసీఆర్ మీద పోరాటం చేయాలని ఉంటే ఈటల తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో చేరేవారన్నారు. ఈటల మీద తెలంగాణ పోలీసులు కేసులు పెట్టారని.. ఆయనకు ఇప్పుడు కేంద్రంలోని హోం శాఖ అవసరం చాలా ఉందన్నారు. మొత్తంగా ఈటల బీజేపీ ఎంట్రీ పూర్తిగా కమర్షియల్ అన్నట్లుగా చెప్పి ఈటల ఇమేజ్ ను డ్యామేజ్ చేశారని చెప్పక తప్పదు.