తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇటీవల కాలంలో గురి చూసి విమర్శలు చేసినట్లుగా.. సందర్భాన్ని చూసి మరీ కడిగిపారేస్తున్న కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ తాజాగా సచివాలయం కోసం రూ.400 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరోనా కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసిందని.. సచివాలయం కోసం మాత్రం రూ400 కోట్లు విడుదల చేయటం ఏమిటని మండిపడ్డారు.
ఓపక్క కరోనా పేషెంట్ ను బతికించటానికి డబ్బుల్లేవని.. చనిపోతే డెడ్ బాడీని ప్యాకింగ్ చేసి కుటుంబ సభ్యులకు ఇవ్వటానికికూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవన్నారు. చనిపోయిన వారిని ప్యాకింగ్ చేసే వారికి అందాల్సిన డబ్బులు అందటం లేదన్న జగ్గారెడ్డి.. విధి లేని పరిస్థితుల్లో గాంధీ సిబ్బంది.. మృతుని కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు.
ఒకవేళ మృతుని కుటుంబీకుల వద్ద డబ్బులు లేకుంటే.. శవాన్ని ఎక్కడో కాల్చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సకు ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న డిమాండ్ ను కేసీఆర్ సర్కారు ఎందుకు రియాక్టు కాలేదని ప్రశ్నించారు. సచివాలయ నిర్మాణం కోసం కేసీఆర్ చూపిస్తున్న శ్రద్ధ.. ప్రభుత్వ ఆసుపత్రుల మెరుగుదల విషయంలోనూ చూపిస్తే బాగుంటుందన్నారు.
కరోనాపై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదన్న ఆయన.. ఇది మానవత్వం లేని ప్రభుత్వమంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రిని సందర్శించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. తనకు కరోనా సోకితే.. గాంధీ ఆసుపత్రిలో చేరతానని మంత్రి తలసాని అంటున్నారని.. ఒకవేళ ఆయన అలా చేస్తే..యాభై మంది వైద్యులు ఆయన చుట్టూనే ఉండాల్సి వస్తుందని.. అలాంటి పరిస్థితి సామాన్య రోగుల విషయంలో ఉంటుందా? అని ప్రశ్నించారు.
ఈటెల రాజేందర్ మాటలకే పరిమితం అయ్యారని.. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్క్రిప్టును చదువుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై జగ్గారెడ్డి విమర్శల్లో అండర్ లైన్ చేయాల్సిన అంశాలున్నాయి. కరోనా వేళ.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న వేళ.. వందలాది కోట్లు ప్రజారోగ్యానికి కేటాయిస్తే బాగుండేది. డాబు కోసం.. దర్పం కోసం.. సౌకర్యం కోసం తర్వాతైనా భారీ భవనాలు నిర్మించుకోవచ్చు కదా? ఇప్పుడున్న విపత్తు సమయంలోనే చేపట్టాలా? అన్నప్రశ్న సామాన్యుడి మెదళ్లను తొలిచేస్తుంది.