బీజేపీ నేత తూర్పు జయప్రకాష్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన సోమవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కుంతియా సమక్షంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనకు ఫోన్ చేసి చెపితేనే బీజేపీలో చేరి మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ చేశానని వెల్లడించారు. బీజేపీలో ఎందుకు చేరానో తనకే తెలియదన్నారు.
ఇక తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెరాస ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల వరకు ప్రతిరోజు టీఆర్ ఎస్ గుండెల్లో దడపుట్టిస్తానని ...2019లో మళ్లీ సంగారెడ్డిలో తానే ఎమ్మెల్యే గా గెలుస్తానని కూడా చెప్పారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ చాలా స్ర్టాంగ్ గా ఉందని...నోటి దురుసు, ఉద్యోగుల వల్లే తాను ఓడిపోయానని జగ్గారెడ్డి చెప్పారు. గతంలో చేసిన తప్పులను తాను పునరావృతం కానివ్వనని...భవిష్యత్తులో కేసీఆర్ పునాదులు కదలడం ఖాయమని జగ్గారెడ్డి చెప్పారు.
చంద్రబాబు చెపితేనే బీజేపీలో చేరానని చెప్పిన జగ్గారెడ్డి పెద్ద బాంబే పేల్చారు. అప్పట్లో ఆయన బీజేపీలో చేరేముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా కలిశారు. అప్పట్లో పవన్ చెపితేనే ఆయన బీజేపీలో చేరారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడ జగ్గారెడ్డి చంద్రబాబు పేరు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కేసీఆర్ అంటే ఒంటికాలితో లేచిపోయే జగ్గారెడ్డి బీజేపీలో మాత్రం సైలెంట్ అయిపోయారు. మళ్లీ సొంతగూటికి చేరుకున్న ఆయన కేసీఆర్ ను మునుపటిలా ఢీ కొడతారా అన్నది చూడాలి.