కాంగ్రెస్ గూటికి జ‌గ్గారెడ్డి!

Update: 2015-07-30 08:14 GMT
తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి. ఈ అస‌లు పేరు కంటే జ‌గ్గారెడ్డి అంటేనే పాపుల‌ర్ అయిన ప్ర‌స్తుత బీజేపీ నేత‌....మాజీ కాంగ్రెస్ నేత సొంత గూటికి చేరుతున్నారా?  త‌న‌దైన శైలిలో దూకుడుగా ఉండే జ‌గ్గారెడ్డి బీజేపీలో ఇమ‌డ‌లేక‌పోతున్నారా అంటే అవున‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.  జగ్గారెడ్డి బీజేపీని వీడి మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరనున్న‌ట్లు స‌మ‌చారం.

ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న జ‌గ్గారెడ్డి వీలైనంత తొంద‌ర‌గా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ తో జగ్గారెడ్డి సమావేశంకానున్నారని స‌మాచారం. డిగ్గీరాజ సై అన్న త‌ర్వాత పార్టీ అధినేత్రి సోనియాగాంధీని క‌ల‌వ‌నున్న‌ట్లు స‌మాచారం.

జగ్గారెడ్డి గతంలో కాంగ్రెస్ లోనే ఉండేవారు. రాష్ట్ర విభజన ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య సిద్దాంతానికి మద్దతు పలికారు. అయితే, అది ఎటూ తేలక... విభజన జరగడంతో జగ్గారెడ్డి కి విచిత్రమైన పరిస్థితులు ఎదురుపడ్డాయి. దీంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ జగ్గారెడ్డి మనస్తత్వానికి ఏమాత్రం ఆ పార్టీ సూటవలేదు. దీంతో చివరకు కాంగ్రెస్ లోకి  వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Tags:    

Similar News