తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ ఎస్.. తెలంగాణ విపక్షం కాంగ్రెస్ ల మధ్య మాటలయుద్ధం అంతకంతకూ ముదురుతోంది. ఒకరిపై ఒకరు చేస్తున్న విమర్శలు అంతకంతకూ శృతి మించుతున్నాయి. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజా గర్జన నేపథ్యంలో టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజాగర్జన సభకు అంతాతానై నిర్వహించిన జగ్గారెడ్డిపై ఆయన మండిపడటంతో పాటు.. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేశారు. మామూలుగానే ఫైర్ బ్రాండ్ అయిన జగ్గారెడ్డి.. తనపై ఎంపీ బాల్క సుమన్ చేసిన విమర్శలతో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ ఉద్యమం ముసుగులో ఎంపీ బాల్క సుమన్ విద్యార్థుల్ని హత్య చేసినట్లుగా ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హత్యల వివరాల్ని తాను బయటపెడతానని వ్యాఖ్యానించారు. సుమన్ తనకు గుండు కొట్టిస్తానని అంటున్నాడని.. దమ్ముంటే తనను ముట్టుకోవాలంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి హరీశ్ రావులే సంగారెడ్డికి రావాలంటే భయపడతారని.. అలాంటిది సుమన్ తనపై వ్యాఖ్యలు చేస్తారా? అని ఫైర్ అయ్యారు.
బాల్క సుమన్ కు దమ్ముంటే ఉస్మానియాలో ముఖ్యమంత్రి చేత సభ పెట్టించగలరా? అంటూ సవాలు చేశారు. తాను తల్చుకుంటే సుమన్ హైదరాబాద్‌లో తిరగకుండా చేయగలనన్నారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా.. చేసుకుంటున్న ఈ విమర్శల తీవ్రత ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏమైనా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో బాల్క సుమన్ హత్యలు చేశారన్న జగ్గారెడ్డి ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎంపీ కాక ముందు ఉస్మానియా వర్సిటీలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకభూమిక పోషించారన్న విషయాన్ని మర్చిపోకూడదు. జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ బాల్క సుమన్ ఎలా రియాక్ట్ అవుతారో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/