పోలీసులారా..జాగ్ర‌త్త. జ‌గ్గారెడ్డి వార్నింగ్‌

Update: 2019-11-08 12:24 GMT
గ‌త కొంత‌కాలంగా...తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను పొగ‌డటంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేత‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తాజాగా స్టాండ్ మార్చారు. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఎల్ల‌కాలం ఉంటారా? ఆయ‌నే ఎప్పుడూ సీఎంగా ఉంటార‌ని...ఒక‌వేళ ఎవ‌రైనా అనుకుంటే..అది అమాయ‌క‌త్వ‌మే అన్నారు. అంతేకాకుండా...తెలంగాణ పోలీసుల‌కు జ‌గ్గారెడ్డి హెచ్చ‌రిక‌తో కూడిన స‌ల‌హా ఇచ్చారు. గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ...ఈ కామెంట్లు చేశారు.

తెలంగాణాలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని జ‌గ్గారెడ్డి ఆరోపించారు. ప్ర‌భుత్వ విధానాల‌ను ప్రశ్నించేవారిని పోలీసులు భయ‌కంపితులు చేస్తున్నారని మండిప‌డ్డారు.``ముందస్తు అరెస్టులు ..తెలంగాణ పోలీసులు చేస్తున్నారా ..?మహారాష్ట్ర వాహనాలలో వచ్చి  మహారాష్ట్ర పోలీసులు చేస్తున్నారా.?తెలంగాణాలో ప్రజలు ఉండాలా ..ఉండొద్దా ..?`అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. తెలంగాణ‌లో...ఎల్లకాలం కేసీఆర్ అధికారంలో ఉండరని పోలీసులు గుర్తుంచుకోవాలని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. ``ఏకపక్షంగా అరెస్ట్ లు చేస్తున్న పోలీసులారా జాగ్రత్త. భవిష్యత్ లో కాంగ్రెస్ ,బీజేపీ ఎవరు అధికారంలోకి వచ్చిన ఇప్పుడు ..ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు కస్టాలు తప్పవు`` అని జగ్గారెడ్డి న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ్గారెడ్డి ఇలాంటి కామెంట్లు చేయ‌డం వెనుక కార‌ణం ఏంటి....రాజ‌కీయ నేత‌ల దృష్టిలో ప‌డ్డ స‌ద‌రు అధికారులు ఎవ‌రు...అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జ‌గ్గారెడ్డి మండిప‌డ్డారు. ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు న్యాయం చేస్తుందని  నమ్ముతున్నామ‌న్నారు. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్ బండ్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోంద‌ని జ‌గ్గారెడ్డి ఈ సంద‌ర్భంగా ప్ర‌కటించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులన్నీ జేఏసీ కి మద్దతుగా  చలో ట్యాంక్ బండ్ పాల్గొంటాయ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ రీతిలో..చలో ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్ ను  సక్సెస్ చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. ప్రజలు సహకరించి ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండాలని కోరారు.
Tags:    

Similar News