తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా ఒక్కటవుతున్నారు. పీసీసీ చీఫ్ రేసులో అయితే ఉత్తమే ఉండాలి.. లేదంటే తమలో ఒకరిని చేయాలి. అంతేకానీ రేవంత్ రెడ్డిని చేయడానికి వీల్లేదని తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీసీసీ రేసులో తాను ఉన్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయని.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముందని.. రేవంత్ ను చేయవద్దని రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని తేల్చిచెప్పారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వడానికి అభిప్రాయాలు కోరుతున్నారని జగ్గారెడ్డి బాంబు పేల్చారు. రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే తాను వ్యతిరేకిస్తానని జగ్గారెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడం సంచలనమైంది. రేవంత్ కు ఇవ్వొద్దని చెబుతానని.. తన అభ్యంతరాలను నేరుగా రేవంత్ రెడ్డికే చెబుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే తన రాజకీయం తాను చూసుకుంటానని జగ్గారెడ్డి హెచ్చరించారు.
ఉత్తమ్ పై రేవంత్ రెడ్డి మద్దతు దారులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ కోవర్టులున్నారని.. కుంతియా దగ్గర ఇద్దరు నేతలు కోవర్టులుగా పని చేస్తున్నారని జగ్గారెడ్డి సంచలన ఆరోపించారు.
రేవంత్ రెడ్డికి తప్పించి ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని జగ్గారెడ్డి అనడం చర్చనీయాంశమైంది. పీసీసీ రేసులో ఆది నుంచి కాంగ్రెస్ వాదులకే ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే కోమటిరెడ్డి సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని.. రేవంత్ కు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దీంతో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు దక్కకుండా కాంగ్రెస్ సీనియర్లు అంతా లాబీయింగ్ మొదలు పెట్టారనే తెలుస్తోంది.