తూర్పు జగ్గారెడ్డి. రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదో చెప్పేందుకు ఓ ఉదాహరణ. రాజకీయ నాయకులు నిక్కచ్చిగా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఓ సజీవ సాక్ష్యం. అసలు ఆయన ఆహార్యమే... "ఈయన రాజకీయ నాయకుడేమిటీ... తీర్ధయాత్రలకు భక్తులను బస్సుల్లో తీసుకువెళ్లే ట్రావెలిస్టు" అనుకుంటారు. ఆడవారి జడల కంటే భారీగా పెరిగిన జట్టు...అంతకు ఎక్కువగా బారుగా పెరిగిన గడ్డం. ముఖాన మహిళలు పెట్టుకునే బొట్టుకుంటే పెద్ద బొట్టు. ఈ ఆహార్యాన్ని చూసిన కొత్త వారెవరైనా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుకోరు. మహా అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడు అని చెబితే కాసింత నమ్ముతారేమో. ఆయన ఆహార్యమే కాదు.... బహిరంగ సభల్లో ఆయన చేసే ప్రసంగాలు కూడా ఆయన వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి.తాను ఎక్కడికి వచ్చాను... ఏం మాట్లాడాలి.... తనతో పాటు ఆ వేదిక మీద ఎవరున్నారు వంటివి కూడా జగ్గారెడ్డికి అవసరం లేదు. తాను, తన ధోరణే ముఖ్యమనుకునే అరుదైన రాజకీయ నాయకుడు.
తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందు మానవ అక్రమ రవాణ కేసులో అరెస్టు అయిన జగ్గారెడ్డి ఓ సంచలనం అయ్యారు. తనను ఎన్నికల్లో ఓడించేందుకే తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నాయకుడు, ఆనాటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనను అరెస్టు చేయించారంటూ ఆరోపించారు. సరే, అవన్నీ ముగిసిన చరిత్ర. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులందరూ ఓటమి పాలైతే జగ్గారెడ్డి మాత్రం విజయం సాధించారు. త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించే బాధ్యత కార్యకర్తలదే అంటూ ఓ సభలో సంచలన ప్రకటన చేశారు. అంతేనా... " నేను శాసనసభ్యుడిగా విజయం సాధించాను. నా దగ్గర డబ్బులు లేవు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ ఆస్తులు అమ్ముకునో... అప్పులు చేసే విజయం సాధించాలి " అని సంచలన ప్రకటన చేశారు. అంతే కాదు.... ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు అప్పులు చేసే స్ధాయి ఉండాలని, అలాంటి వారిని అభ్యర్ధులుగా ప్రకటించాలని కూడా అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే డబ్బులు చాలా అవసరమని, కార్యకర్తలకు డబ్బులు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తాను కాంట్రాక్టర్లు చేస్తానన్నారు. వచ్చే ఆరు నెలలు తాను నియోజకవర్గంలో ఉండనని, సంపాదన యాత్రలకు వెళ్తానని జగ్గారెడ్డి ప్రకటించడం సంచలనమయ్యింది. తాను తిరిగి వచ్చే వరకూ తన భార్య నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారని, అన్ని కార్యక్రమాలకు ఆమె హాజరవుతారంటూ ముక్తాయింపు ఇచ్చారు. దటీజ్ జగ్గారెడ్డి అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?