కాంగ్రెస్ అధిష్ఠానానికి జగ్గారెడ్డి లేఖ..అందులో ఏమున్నాయంటే..?

Update: 2022-02-19 10:40 GMT
కాంగ్రెస్ పార్టీని వీడతానంటూ సంచలనం రేపుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు. అధినేత్రి సోనియాగాంధీ , అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ మేరకు మూడు పేజీల లేఖ పంపారు. దానిని మీడియాకూ విడుదల చేశారు. అందులో ఏమేం విషయాలున్నాయంటే..

1) కాంగ్రెస్ పార్టీని వీడినా గాంధీ కుటుంబం పై గౌరవం తో ఉంటా.

2) ఈ ప్రకటన విడుదల చేసిన నాటి నుండి నేను కాంగ్రెస్ గుంపులో ఉండను.

త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తా

3)  కాంగ్రెస్ లోకి అకస్మాత్తుగా  వచ్చి లాబీయింగ్ చేసి  పీసీసీ కావొచ్చు.

4) సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్రవేస్తున్నారు.

5) పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.

 6) కాంగ్రెస్ లో గతంలో పార్టీలో  వివాదాలు ఉన్నప్పటికీ హుందాగా ఉండేది.. కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదు.

7) కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేను.

8) రాజీనామా చేసి ప్రజల్లో  స్వతంత్రంగా సేవ చేస్తా. పార్టీలో ఎవరు కోవర్టులో అధిష్టానం  గుర్తించాలి.

9)  రాహుల్ గాంధీ సభ పెట్టమంటే ఎవరూ ముందుకు రాకుంటే నేను కోట్లు ఖర్చు చేసి 2017లో సభ నిర్వహించాను.  ఆ సభ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడింది.. పార్టీ కోసం కష్టపడింది నేనా కోవర్టుని... సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతల కోవర్టులు...?

10) ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పేట్టకుంటే  నేను మెదక్ జిల్లా నుంచి అభ్యర్దిని పెట్టి... కోట్లు ఖర్చు చేశా.  పార్టీ కి ఒక్క ఓటు తగ్గకుండా పరువు నిలిపాను. సీనియర్లు ఎవ్వరు కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారు... ఎవరు కోవర్టులు? అభ్యర్థిని పెట్టినవాళ్లా..? లేక పెట్టని వాళ్లా..?

11) హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్ల ను మూడువేల ఓట్ల కు పరిమితం చేసిన వాళ్ళు కోవర్టులా....? నేనా...?

12) గాంధీ కుటుంబం పై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది నేను.. మరి పార్టీలో పదవులు అనుభవిస్తున్నవాళ్ళు ఎందుకు స్పందించకుండా మౌనంగా ఉన్నారు?  వాళ్లు కోవర్టులా .?లేక నేనా...అధిష్టానం గుర్తించాలి.
Tags:    

Similar News