ఆపరేషన్ చేస్తూ కడుపు కోసి కత్తుల్ని వదిలేసే ఉదంతాల గురించి చాలానే విని ఉంటాం. ఇది అందుకు కాస్త భిన్నమైంది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పుణ్యమా అని ఒక మహిళ దారుణమైన ఇబ్బందిని ఎదుర్కొంది. డెలివరీ కోసం వచ్చిన ఒక మహిళకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ చేసే క్రమంలో జిల్లా ఆసుపత్రి వైద్యులు మాపు గుడ్డను వదిలేసి కుట్టేసిన వైనం బయటకు వచ్చి సంచలనంగా మారింది.
ప్రసవం తర్వాత రక్తస్రావాన్ని నిలువరించేందుకు ఉపయోగించే మాపు గుడ్డను బయటకు తీయాల్సి ఉంటే దాన్ని మర్చిపోయారు. గుడ్డను అలానే ఉంచేసి కుట్లు వేశారు. డెలివరీ తర్వాత వారం రోజులకు తీవ్ర కడుపునొప్పితో ఆ మహిళ విలవిలలాడారు. దీంతో ఆ మహిళను మళ్లీ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె సమస్యను గుర్తించలేకపోయారు. పరీక్షలు జరిపి.. సాధారణ నొప్పిగా చెబుతూ.. మందులు ఇచ్చారు. అయినప్పటికీ నొప్పి తగ్గకపోగా.. వాంతులు రావటం.. తీవ్ర కడుపు నొప్పికి గురి కావటంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. ఆమె కడపుతో గుడ్డ పెట్టి మర్చిపోయిన వైనాన్ని గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స జరిపి.. ఆ క్లాత్ పీస్ ను బయటకు తీశారు.
కడుపులో క్లాత్ పీస్ మర్చిపోయిన వైనం గురించి తెలుసుకున్న బాధిత మహిళ కుటుంబ సభ్యులు.. జిల్లా ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లగా. .పని ఒత్తిడితో అలా జరిగిందని చెప్పటం గమనార్హం. దీంతో.. ఒళ్లు మండిన బాధిత మహిళ తరఫు వారు గుడ్డను మర్చిపోయిన వైద్యురాలి పేరును చెప్పాల్సిందిగా కోరుతున్నారు. అయితే.. సదరు మతిమరుపు వైద్యురాలి పేరును బయటపెట్టేందుకు మాత్రం ఆసుపత్ర వర్గాలు సిద్ధంగా లేకపోవటం గమనార్హం.