జగన్ కి జై కొట్టిన తమిళనాడు అసెంబ్లీ !

Update: 2020-01-10 06:59 GMT
అదేంటి ? తమిళనాడు అసెంబ్లీ లో జగన్ కి ఎందుకు జై కొట్టారు అని ఆలోచిస్తున్నారా? మంచిని ఎవరైనా పొగడకుండా ఉంటారా చెప్పండి..తమిళనాడుకి సీఎం జగన్ అందించిన సాయానికి తమిళనాడు అసెంబ్లీ లో ప్రభుత్వ పక్షం , ప్రతిపక్షం నేతలందరూ కలిసి జగన్ కి జేజేలు పలికారు. ఆపద వస్తే ఆదుకోవడానికి మంచి మనసు కావాలని ..అది ఏపీ సీఎం వద్ద చాలా ఉంది అని తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి అన్నారు. తమిళనాడు కి నీటి కష్టం వచ్చినప్పుడు ..అడిగిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రజలకి కావాల్సిన తాగునీటిని తెలుగుగంగ ద్వారా అందించి ఆదుకున్నారంటూ తమిళనాడు సీఎం , ఏపీ సీఎం జగన్ కి అసెంబ్లీ సాక్షిగా కృతజ్నతలు తెలిపారు.

చెన్నై ప్రజల దాహాన్ని చెంబరబాక్కం, పూండి, పుళల్, చోళవరం జలాశయాలు తీరుస్తున్నాయి. 2018లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 2019 లో చెన్నై నగరం, శివారు ప్రాంతాలు నీటి కటకటను ఎదుర్కొన్నాయి. జోలార్‌ పేట నుంచి రైలుద్వారా చెన్నైకి నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రుతుపవనాల ప్రవేశం, ఆంధ్రప్రదేశ్‌ నుంచి కృష్ణానీటి రాకతో నాలుగు జలాశయాల్లో నీటి మట్టం పెరిగింది. ఇంత వరకు కృష్ణానది నుంచి తెలుగుగంగ పథకం కింద నాలుగు టీఎంసీల నీరువచ్చింది. ఈ నీటితో ఐదు నెలలపాటు నీటిని సరఫరా చేయవచ్చుఅని తెలిపారు. అడిగిన వెంటనే ఏపీ సీఎం కృష్ణా నీరు ఇచ్చి ఆదుకోవడం వల్లనే చెన్నై నలుమూలలా మెట్రో వాటర్‌ను సరఫరా చేయగలిగామని సీఎం ఎడపాడి అన్నారు. ఫిబ్రవరి ఆఖరు వరకు పూండికి కృష్ణా నీటిని సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు మెట్రో వాటర్‌ అధికారి ఒకరు చెప్పారు.

ఈనెల 6వ తేదీన ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి. గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ప్రసంగానికి సీఎం ఎడపాడి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. గత ఏడాది వేసవిలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని రాష్ట్ర మంత్రులు స్వయంగా కలుసుకుని తెలుగుగంగ పథకం కింద తమిళనాడు కు కేటాయించిన నీటిని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలుగుగంగ నీటితో గ్రేటర్‌ చెన్నై ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. తమ కోర్కెను మన్నించి సకాలంలో సహకరించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా గవర్నర్ ప్రంసగానికి ధన్యవాదం తెలిపే సమయంలో కృతజ్ఞతలు తెలిపారు.




Tags:    

Similar News