ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నిదేశాలు స్వలింగ సంపర్కం నేరం కాదని ప్రకటించాయి. భారతదేశంలోనూ అనధికారికంగా స్వలింగ సంపర్కం నేరం కాదని కొన్ని కేసుల్లో కోర్టులు చెప్పాయి. 2009 జూలై 2న ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వ్యక్తుల మధ్య అంగీకారంతో సెక్స్ జరిగితే అది నేరం కాదని తీర్పునిచ్చింది. అయితే స్వలింగ సంపర్కం నేరమే కాదు... ఇలా చేయడానికి ప్రయత్నించినా కఠినమైన శిక్ష వేసే దేశం కూడా ఉంది. అదే ఆస్ట్రేలియా. ఈ దేశంలోని కూమా ప్రాంతంలో ఓ జైలు ఉంది. ఇది ప్రత్యేకంగా స్వలింగ సంపర్క నేరం చేసిన వారి కోసమే నిర్మించారు. కుమా జైలు ను ఎందుకు నిర్మించాల్సి వచ్చింది..? ఇందులో ఉండే శిక్షలు ఏంటి..? ఒకసారి చూద్దాం..
కుమా.. ఆస్ట్రేలియలోని ఒక చిన్న పట్టణం. స్వలింగ సంపర్కం చేసేవారిని నేరంగా భావించి వారిని ఇక్కడికి తీసుకొస్తారు. స్వలింగ సంపర్క జీవితాన్ని సమాజం నుంచి పూర్తిగా తరిమేయాలనే ఉద్దేశంలో 1957లో దీనిని నిర్మించారు. ప్రపంచంలో స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేకంగా జైలు లేదు. కానీ కుమా జైలును మాత్రం ప్రత్యేకంగా వారి కోసమే నిర్మించారు. ఇక్కడికి వచ్చే ఖైదీలను వేర్వేరు గదుల్లో ఉంచుతారు. అమెరికా, యూరప్ దేశాలన్నీంటిలోనూ ఇలాంటి జైలు ఎక్కడా లేదని సౌత్ వేల్స్ జస్టిస్ మంత్రి రెగ్ డౌనింగ్ 1957లో సిడ్నీ మార్నింగ్ పేపర్ కు తెలిపారు.
1955లో కొత్తగా విధించిన కఠినమైన చట్టాల్లో స్వలింగ సంపర్కాన్ని చేర్చారు. దీనిని నేరంగా భావించి.. ఆ నేరాన్ని రూపు మాపేందుకు చట్టాన్ని చేయాల్సి వచ్చింది. స్వలింగ సంప్కరమే కాకుండా అందుకు సంబంధించిన పనులు చేసినా కూడా జైలులు పెట్టేవారు.
ఒక పురుషుడు మరొక పురుషుడితో మాట్లాడుతున్నట్లు కనిపించినా బంధించేంత పనిచేసేవారని చరిత్ర కారుడు గ్యాలీ వోధర్ స్పూన్ తెలిపారు. ఇలా అసహజ లైంగిక పనులు కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించేవారు. అందుకు పాల్పడేందుకు యత్నించిన వారికి ఐదేళ్లు, అలాగే పరస్పర అంగీకారంతో చేసినా ఇదే తరహాలో శిక్షలు వేసేవారు.
స్వలింగ సంపర్కులను జైలులు పెట్టి వారిలో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు ఇక్కడికి మానసిక వైద్యులు వచ్చేవారు. అంతేకాకుండా వారు అలా మారడానికి కారణాలను వారికి తెలిపేందుకు 1958లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ కూడా వేసింది. వైద్య, మానసిక, పెనాలజీ నిపుణులు, సామాజిక కార్యకర్తలను ఈ కమిటీలను సభ్యులుగా చేర్చారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఖైదీల మానసిక స్థితిగతులను తెలుసుకొనేవారు. అయితే చాలా మంది తల్లుల ప్రేమ మరీ ఎక్కువ కావడంతో వారు ఇలా మరడానికి కూడా కారణం ఉందని పాడ్ కాస్ట్ ప్రొడ్యూసర్ ప్యాట్రిక్ అబౌద్ చెప్పారు.
అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలం కూడా అయ్యాయి. స్వలింగ సంపర్కం చేయొద్దని జైలులో పెట్టడం వల్ల కొందరు కొత్త సంబంధాలను కలుపుకున్నారు. జైలు నుంచి బయటకువ వచ్చాక మళ్లీ ఈ నేరం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా కొందరు పోలీసులు స్వలింగ సంపర్కులను రెచ్చగొట్టేవారని అంటున్నారు. టాయిలెట్లకు వెళ్లి మరీ వారితో లైంగిక కార్యం చేయాలని ఒత్తిడి చశారని ఆరోపణులున్నాయి. అయితే ఇది నిజం కాదని కమిటీ నివేదిక ఇచ్చింది.