పెద్ద నోట్ల రద్దు చేసిన సమయంలో గంభీరమైన ప్రకటనలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ - బడ్జెట్ తర్వాత గాలి తీసిన టైర్‌లా మారిపోయారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు నేపథ్యంలో బడ్జెట్‌లో కేంద్రం తమకు ఎన్నో కల్పిస్తుందని అన్ని వర్గాల ప్రజలు ఆశించారని, వారి ఆశలను మోడీ నీరుగార్చారని జైపాల్ రెడ్డి విమర్శించారు. నోట్ల రద్దు వల్ల కలిగిన లాభాలేమిటో కూడా చెప్పలేకపోయిందన్నారు. ఎంత డబ్బు బ్యాంకుల్లో జమ అయిందన్న సమాచారం కేంద్రం వద్ద లేక పోవడంపై సిగ్గుచేటన్నారు.70 ఏండ్లలో ఏనాడూ ఇలాంటి నిరాశ పూరిత బడ్జెట్ చూడలేదని చెప్పిన జైపాల్ రెడ్డి...ఈ బడ్జెట్ నిరర్ధకమైనదని, ఏ దిశా లేకుండా ఉందన్నారు.
బడ్జెట్ కొత్తగా ఉందని, అద్భుతమని చెప్పే వారు వాస్తవాలను అర్థం చేసుకోవాలని జైపాల్ రెడ్డి సూచించారు. ఆర్భాటంగా రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో కలిపి ప్రవేశపెట్టడం తప్ప కొత్త దనం ఏముందని ప్రశ్నించారు. కొత్త రైల్వే లైన్ లు - కొత్త పరిశ్రమలు లేవని - ఈ ప్రభుత్వ పాలనలో ఉన్న పరిశ్రమలే వాటి సామర్ధ్యం మేరకు పని చేయడం లేదన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గుదల వల్ల కేంద్రానికి ఏటా రూ లక్ష కోట్లు ఆదా అయ్యాయని, అయినప్పటికీ బడ్జెట్ లో సామాన్యులకు ఊరట లభించలేదని చెప్పారు. నోట్ల రద్దుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మద్దతిచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ దీని వల్ల రాష్ట్రానికి ఎం లాభం జరిగిందో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు నిధులను సేకరించడంపై చేసిన ప్రతిపాదనలు కంటితుడుపు చర్యలేనని, రాజకీయ పార్టీలకు నిధుల సమీకరణలో సంస్కరణలు నామమాత్రమేనన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/