ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఎప్పటి నుంచో కామెంట్ ఇది. కొత్తకాకపోయినా.. ఇప్పుడు మరోసారి తెరమీదికి రావడం.. భారీ ఎత్తున ట్రోల్ కావడమే ఆసక్తిగా మారింది. మోడీని టెలీప్రాంప్టర్ ప్రధానిగా పేర్కొంటూ.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నేతలు సహా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నాయకులు సైతం ట్రోల్ చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. దేశంలో ఎక్కడికి వెళ్లినా.. తొలుత స్వభాషలో ప్రసంగిస్తారు. అక్కడి ప్రజలను ఆ భాషలోనే పలకరిస్తారు.
ఒకటి రెండు మాటలు అయితే.. సరే.. అదేపనిగా.. ఆయా ప్రాంతాలకు చెందిన సంస్కృతులు కూడా ప్రస్తావిస్తారు. అనర్గళంగా మాట్లాడతారు.
వాస్తవానికి మోడీకి పెద్దగా ఇంగ్లీష్ రాదు. ఆయనే చెప్పారు.. ``నేను పెద్దగా చదువుకోలేదని`` సో.. ఆయనకు ఇంగ్లీష్ రాదు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన అనర్గళంగా ఆంగ్లం దంచికొడతారు. మరి ఇవన్నీ ఆయనకు ఎలా వచ్చు? ఎలా తెలుసు? అంటే.. ``ఎదురుగా టెలీప్రాంప్టర్ ఉండబట్టే!`` అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. ప్రధాని మోడీ ఎక్కడ సభ పెట్టినా.. ఆయనకు కొంత దూరంలో ఈ టెలీ ప్రాంప్టర్ ఉంటుందని చెబుతున్నారు.
దీనిలో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ప్రసంగం రాతప్రతి.. కదులుతూ ఉండగా.. వార్తలు చదివినట్టు మోడీ చదివేస్తారు. అయి తే.. వార్తలు చదివే వారు హావ భావాలను ప్రదర్శించరు కానీ.. మోడీ ఒకింత వాటిని ప్రదర్శిస్తారు.
దీంతో ఆయన ప్రసంగాలు రక్తి కడుతున్నాయి. ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు.. మోడీని ఓ ఆట ఆడేసుకున్నారు. మోడీ నోటి నుంచి మాట రావాలంటే.. `టెలిప్రాంప్టర్` కావాల్సిందే.. అంటూ ట్వీట్ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్ టెలీప్రాంప్టర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత.. జైరాం రమేష్ ప్రధానిని ఉద్దేశించి ఆసక్తిగా స్పందించారు. ``ఆయన టెలిప్రాంప్టర్ జీవి`` అని సంబోధిస్తూ.. ట్వీట్ చేశారు. ఇక, ఈ విషయంలోకి దూసుకొచ్చిన తెలంగాణ అధికార పార్టీ నేతలు.. ``మోడీ మస్ట్ ఆన్సర్`` హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేస్తున్నారు. మరి దీనిపై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.