ఫిబ్రవరి 25 వ తేదీన ముంబై లోని ముఖేష్ అంబానీ ఇంటి ముందు గుర్తు తెలియని వాహనం నిలిపివేసి ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా అందులో పేలుళ్లకు వినియోగించే జిలెటిన్ స్టిక్స్ బయటపడ్డాయి. ఇది ట్రైలర్ మాత్రమే..అని హెచ్చరించడంతోపాటు బిట్ కాయిన్ ద్వారా డబ్బు డిమాండ్ చేసినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. అంతేకాదు మీకు వీలైతే మమ్మల్ని ఆపండి అని దర్యాప్తు సంస్థలకు జైష్-ఉల్-హింద్ సవాల్ విసిరిందన్న వార్త మరింత ఆందోళన రేపింది.
దీనితో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ముఖేష్ అంబానీ ఇంటి ముందు వాహనాన్ని నిలిపిన వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున ఆ వాహనం నిలిపింది తామే అని జైష్ ఉల్ హింద్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే , తాజాగా ఇందులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపి ఉంచింది తామేనని 'జైష్ ఉల్ హింద్' సంస్థ ప్రకటించిందన్నవార్త ఫేక్ న్యూస్ అంటూ జైష్-ఉల్-హింద్ ప్రకటించింది.
ఈ మేరకు జైష్-ఉల్-హింద్ ఒక ప్రకటన విడుదల చేసిందని బిజినెస్ టుడే నివేదించింది. టెలిగ్రామ్ ఖాతాలో, జైష్-ఉల్-హింద్ పేరిట విడుదల చేసిన పోస్టర్ తో తమకు సంబంధంలేదని వెల్లడించింది. జైష్-ఉల్-హింద్ నుండి అంబానీకి ముప్పు లేదు అనే పేరుతో వెల్లడించిన వివరణలో తమ పోరాటం బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ ఫాసిజానికి వ్యతిరేకంగా మాత్రమే. హిందూ అమాయక ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. మా పోరాటం షరియా కోసం, డబ్బు కోసం కాదు. లౌకిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం గానీ అంబానీకి వ్యతిరేకంగా కాదు అని తెలిపింది. అలాగే తాము అవిశ్వాసులనుంచి డబ్బులు తీసుకోమని, భారతీయ వ్యాపార దిగ్గజాలతో తమకెలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది.