లాడెన్ ను దాచిపెట్టినా మీరా మాట్లాడేది.. పాకిస్తాన్ ను ఐరాసలో కడిగేసిన జైశంకర్

Update: 2022-12-15 07:30 GMT
విదేశాంగ మంత్రి   ఎస్ జైశంకర్ ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్ ను కడిగిపారేశాడు.  పాకిస్తాన్‌పై సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని.. ప్రపంచానికి ఇది ఆమోదయోగ్యం కాదని తెలిపారు. భారత పార్లమెంటుపై దాడి చేసిందని.. అల్-ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ను దాచేసిందని.. అలాంటి దేశాన్ని  ఎప్పుడూ సమర్థించరాదని చెంపపెట్టులా సమాధానమిచ్చారు.  అంతర్జాతీయ వేదికపై భారత్ ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించిన పాకిస్తాన్ కు మరోసారి షాకిచ్చాడు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన దాయాదికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దీటుగా బదిలిచ్చారు.

వాతావరణ మార్పు, కరోనా మహమ్మారి, సంఘర్షణలు లేదా ఉగ్రవాదం వంటి మన కాలంలోని కీలక సవాళ్లపై దాని ప్రతిస్పందనపై ఐకర్యరాజ్యసమితి విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. మేము ఉత్తమ పరిష్కారం కోసం శోధిస్తున్నప్పుడు, మన అటువంటి బెదిరింపులను సాధారణీకరించడాన్ని ఎప్పుడూ అంగీకరించకూడదు, అని అమెరికా భద్రతా మండలిలో బహిరంగ చర్చ సందర్భంగా జైశంకర్ అన్నారు.

"ప్రపంచం ఆమోదయోగ్యం కానిదిగా భావించే వాటిని సమర్థించే ప్రశ్న ఎప్పటికీ తలెత్తకూడదు. ఇది సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశానికి స్పాన్సర్‌షిప్‌కు వర్తిస్తుంది, ఒసామా బిన్ లాడెన్‌కు ఆతిథ్యం ఇవ్వడం.. పొరుగున ఉన్న పార్లమెంటుపై దాడి చేయడం వంటివి ఈ కౌన్సిల్ ముందు ప్రసంగించడానికి ఆధారాలుగా ఉపయోగపడవు" అని పాకిస్తాన్ తీరును జైశంకర్ ఐరాసలో నిలదీశారు. పాకిస్థాన్ పేరు చెప్పకుండా ఉతిరి ఆరేశాడు.

'అంతర్జాతీయ శాంతి మరియు భద్రత నిర్వహణ: సంస్కరించబడిన   కొత్త ధోరణి'పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చకు అధ్యక్షత వహించిన జైశంకర్, సంఘర్షణ పరిస్థితులపై బలమైన వాదనను చేశారు.

"ఉగ్రవాదం యొక్క సవాలుపై, ప్రపంచం మరింత సమిష్టి ప్రతిస్పందనతో కలిసి వస్తున్నప్పటికీ, నేరస్థులను సమర్థించడానికి .. రక్షించడానికి బహుపాక్షిక వేదికలను దుర్వినియోగం చేస్తున్నారు" అని పాక్ తీరును జైశంకర్ ఎండగట్టారు.  యూఎన్ భద్రతా మండలి ఆంక్షల కమిటీలో చైనా వంటి శాశ్వత సభ్యులను వీటో-విల్డింగ్ చేయడం ద్వారా జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి పాకిస్తాన్ నేలపై ఆధారపడిన ఉగ్రవాదులను బ్లాక్ లిస్ట్‌లో చేర్చే ప్రతిపాదనలపై పదేపదే అడ్డంకులు సరికాదని  అన్నారు.. శక్తివంతమైన 15 దేశాల కౌన్సిల్‌ను ఉద్దేశించి జైశంకర్ మాట్లాడుతూ, సంస్కరణలు ఈనాటి అవసరం అని అన్నారు. "గ్లోబల్ సౌత్, ముఖ్యంగా, పట్టుదలతో ఉండాలనే భారతదేశం  సంకల్పాన్ని నేను విశ్వసిస్తున్నాను," అని  చెప్పాడు.

"భద్రతా మండలి సభ్యత్వంపై సమాన ప్రాతినిధ్యం.. పెంపుదల ప్రశ్న గత మూడు దశాబ్దాలుగా ఎజెండాలో ఉందని మనందరికీ తెలుసు. సంస్కరణలపై చర్చ లక్ష్యం లేకుండా సాగుతున్నప్పటికీ, వాస్తవ ప్రపంచం ఈ సమయంలో నాటకీయంగా మారిపోయింది," అని భారత్ కు సభ్యత్వం ఇవ్వకపోవడాన్ని జైశంకర్ తప్పుపట్టారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full ViewFull ViewFull ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News