అమెరికా మీడియాకు చురకలంటించిన జైశంకర్

Update: 2022-09-26 11:30 GMT
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా వారి మీద పడిపోయి ఆయా దేశాలను కించపరిచే విధంగా కథనాలు రాస్తుంటుంది. కానీ వారికి కరెక్ట్ సమాధానం ఇవ్వనంతవరకే ఇలా చెలరేగిపోతుంటారు. తాజాగా  విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారతదేశంపై వారి అమెరికా మీడియా "పక్షపాత" కవరేజీని కడిగిపారేశారు. వాషింగ్టన్ పోస్ట్‌తో సహా ప్రధాన స్రవంతి అమెరికన్ మీడియాను నిందించారు. "నేను అమెరికన్ మీడియాను చూస్తున్నాను. మీకు తెలిసిన కొన్ని వార్తాపత్రికలు ఉన్నాయి. అందరూ కూడబలుక్కొని మరీ భారత్ పై విషం కక్కుతున్నారు" అని జైశంకర్ ఆడిపోసుకున్నారు. దీంతో అక్కడున్న  భారతీయ-అమెరికన్‌లు  చప్పట్లతో ఆయనకు మద్దతు తెలిపారు.  

భారత్ పై పక్షపాత ధోరణిలో కథనాలు ప్రచురితం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మీడియాలో రాజకీయాలు నడుస్తున్నాయంటూ కశ్మీర్ అంశంపై అగ్రదేశంలో జరిగిన చర్చ గురించి వ్యాఖ్యానించారు.   "నా ఉద్దేశ్యం ఏమిటంటే, పక్షపాతం చూపిస్తున్నాయి. నిర్ణయించడానికి నిజంగా ప్రయత్నాలు ఉన్నాయి... భారతదేశం ఎంత ఎక్కువ తన దారిలో వెళ్తుందో.. భారతదేశానికి సంరక్షకులు మరియు రూపకర్తలు అని నమ్మే వ్యక్తులు భారతదేశంలో మరింత వాస్తవాన్ని కోల్పోతారు" అని జైశంకర్ అన్నారు. ఈ దేశంలో "భారత వ్యతిరేక శక్తుల" పెరుగుదలపై ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

అలాంటి గ్రూపులు భారతీయుల మనసులు గెలవలేవని ఆయన అన్నారు. అలాంటి గ్రూపులు బయటి నుంచి విజయం సాధిస్తాయని లేదా భారత్‌ను బయట నుంచి రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తాయని మంత్రి పేర్కొన్నారు.

" పోటీ చేయడం చాలా ముఖ్యం. చాలా మంది అమెరికన్లకు స్వదేశంలో ఎలాంటి సూక్ష్మబేధాలు మరియు సంక్లిష్టతలు తెలియవు కాబట్టి, తిరిగి కూర్చోకుండా ఉండటం ముఖ్యం "అని అతను చెప్పాడు.

అమెరికా రాజధానిలో కాశ్మీర్ సమస్యను తప్పుగా చిత్రీకరించడంపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ, ఉగ్రవాద సంఘటన జరిగితే చంపబడిన వ్యక్తి ఏ మతానికి చెందినవాడో పట్టింపు లేదని అన్నారు.

"భారత సైనికులు లేదా భారతీయ పోలీసులు అపహరణకు గురైతే; ప్రభుత్వం కోసం పనిచేసే వ్యక్తులు లేదా పౌరులు తమ వ్యాపారం కోసం వెళుతున్నట్లయితే, వారి ప్రాణాలను ఎవరు తీస్తున్నారు? అన్నది రాయాలని.. మతంపై కాదని " అని ఎదురు ప్రశ్నించారు. వాస్తవానికి, మీడియా కవరేజీని చూడండి. మీడియా ఏమి కవర్ చేస్తుంది? మీడియా ఏమి కవర్ చేయదు?" అని విదేశాంగ మంత్రి అడిగారు.

"ఇంటర్నెట్ కట్ చేయబడిందని పెద్ద పాట పాడుతున్నారని..   మానవ ప్రాణనష్టం కంటే ప్రమాదకరం ఇంటర్నెట్ అని చెప్పే దశకు చేరుకున్నట్లయితే, నేను ఏమి చెప్పగలను?" జైశంకర్ మీడియాను సూటిగా ప్రశ్నించారు.

కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370పై వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వచ్చిన కథనాలుపై మండిపడ్డారు. దీన్ని వక్రీకరించారని.. ప్రజలు నిజం ఏదో.. అబద్ధమేదో తెలియక అయోమయానికి గురవుతున్నారని జైశంకర్ అన్నారు. మీడియాలోనూ రాజకీయాలు నడుస్తున్నాయని.. ఈ పోటీ ప్రపంచంలో మన సందేశాన్ని బయటకు తెలియజేయాలి? అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలను విద్యావంతులను చేయాలని.. ఈ సమయంలో ఇదే నేనిచ్చే సందేశం అంటూ జైశంకర్ ముగించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News