ఏ నేత అయినా ఎన్నికలొస్తే జనాల్ని మెప్పించాల్సిందే. నా ఇష్టం అనడానికి కుదరని సంవత్సరం బడ్జెట్. మోడీ మాత్రం వేరు కాదు. ఇది ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా మరోసారి తేలింది. జనాల్ని ఆకట్టుకోవడంలో భాగంగా బడ్జెట్ అంతా రూరల్ పైనా - అభివృద్ధిపైనా ఫోకస్ అయ్యింది. ఇందులో హైలెట్ ఏంటంటే... పది కోట్ల కుటంబాలకు అంటే దాదాపు 50 మందికి అంటే సగం భారతదేశానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించే పథకం ఒకటి మోడీ ప్లాన్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వైఎస్ తర్వాత వచ్చిన ఏ సీఎం కూడా దీన్ని తొలగించలేకపోయారంటే దీని అవసరం జనానికి ఎంత ఉందో అర్థం అవుతుంది. ఈ కీ పాయింట్ ను మోడీ గ్రహించాడు. దానిని చక్కగా బడ్జెట్లో పెట్టేశాడు.
ఇక నుంచి దేశంలో 10 కోట్ల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అవకాశం కల్పిస్తారు. అంటే దాదాపు పేదలు - దిగువ మధ్యతరగతి ప్రజలు అందరూ కవర్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వారి జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు చాలా కుటుంబాలు వైద్యం చేయించుకోలేక అప్పులు పాలయ్యే పరిస్థితి ఇక పేద కుటుంబాల్లో కనిపించకపోవచ్చు. ఈ బడ్జెట్ లో పలు హైలెట్స్ ఉన్నాఅందులో ఇది ప్రధానమైనది. దీంతో పాటు మత్సకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వడం - ప్రతి గ్రామానికి పక్కా రోడ్లు - ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు - 50 లక్షల మందికి ఉద్యోగ శిక్షణ - ఇంటింటికీ తాగునీటికి భారీ బడ్జెట్ కేటాయించడం వంటివెన్నో జనాకర్షక పథకాలు ఈ బడ్జెట్ లో ఉన్నాయి.
ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రాధాన్యం. మహిళలు కనుక చేస్తే ప్రత్యేక రాయితీలుంటాయి. వ్యవసాయానికి - ఫుడ్ ప్రాసెసింగ్ - గ్రామీణ విద్యుత్ పథకాలకు కూడా భారీ ప్రాధాన్యం ఇచ్చారు. జన్ ధన్ అక్కౌంట్లకు బీమా సదుపాయం కూడా కల్పించారు. రైతలకు మద్దతు ధర ఒకటిన్నర శాతం పెంచడంతో పాటు ఇక నుంచి దానిని లెక్కించేందుకు ఒక సంస్థను ఏర్పాటుచేస్తారు.