ఆ సీఎం మీద మ‌రో రూ.10కోట్ల కేసు

Update: 2017-05-22 13:36 GMT
ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ టైం ఏమాత్రం బాగోన‌ట్లుగా ఉంది. ఇప్ప‌టికే ఉన్న కేసులు స‌రిపోవ‌న్న‌ట్లు తాజాగా మ‌రో కేసు ఆయ‌న నెత్తికి చుట్టుకుంది. ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘ అధ్య‌క్షునిగా ఉన్న‌ప్పుడు కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ నిధులు దుర్వినియోగం చేశారంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై సీఎం కేజ్రీవాల్ పై జైట్లీ రూ.10 కోట్ల ప‌రువున‌ష్టం దావా వేశారు.

ఈ కేసును వాదించేందుకు సీఎం కేజ్రీవాల్ త‌ర‌ఫున  ప్ర‌ముఖ లాయ‌ర్ రాంజెఠ్మ‌లానీ రంగంలోకి దిగారు. ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌యోగించిన ప‌దాలు తీవ్రంగా ఉండ‌టంపై జైట్లీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌రువున‌ష్టం కేసులో ఫిర్యాదుదారు వ్య‌క్తిత్వం చాలా ముఖ్య‌మ‌ని.. అయితే కేసు వాద‌న‌ల సంద‌ర్భంగా కేజ్రీవాల్ లాయ‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌టంపై జైట్లీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. ఇలాంటి మాట‌ల్ని కేజ్రీవాల్ సూచ‌న‌తోనే చేస్తున్నారా? వ‌్య‌క్తిగ‌త హోదాతో చేస్తున్నారా? అంటూ క్వ‌శ్చ‌న్ చేశారు. రాంజెఠ్మలానీ మాట‌ల్ని ఢిల్లీ హైకోర్టు సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

ఇదిలా ఉండ‌గా.. కేసు విచార‌ణ సంద‌ర్భంగా కేజ్రీవాల్ త‌ర‌ఫు న్యాయ‌వాది ప్ర‌యోగించిన అనుచిత ప‌దాల‌పై త‌న అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేస్తూ.. తాజాగా జైట్లీ మ‌రో ప‌రువున‌ష్టం దావా వేశారు. గ‌తంలో ఉన్న రూ.10కోట్ల ప‌రువున‌ష్టం దావాకు అద‌నంగా మ‌రో రూ.10కోట్ల ప‌రువున‌ష్టం దావా వేశారు. ఉన్న కేసుల్ని కొట్టేసేందుకు వీలుగా లాయ‌ర్‌ను పెట్టుఉన్న ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌కు కొత్త కేసు మీద ప‌డ‌టం ఇబ్బంది క‌లిగించే ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News