ఆగ్రహం ఉండాలి. అయితే.. అది ధర్మాగ్రహంగా ఉండాలి. ఆవేశం తప్పు కాదు కానీ.. అందులో లాజిక్కు ఉండాలి. విమర్శ చేస్తే అందులో పాయింట్ ఉండాలే కానీ.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేయటం.. ఏదో తిట్టాలి కాబట్టి తిడతామన్నట్లుగా తిట్టటం ఏ మాత్రం సరికాదు. తాజాగా తెలుగు తమ్ముళ్ల తీరు ఇదే రీతిలో ఉంది. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అధికార టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు.
నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్న వైనంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో మాటల దాడి మామూలే కానీ.. దిగజారుడు వ్యాఖ్యల క్రెడిట్ మాత్రం టీడీపీ నేతల సొంతంగా చెప్పక తప్పదు. ఏపీ అధికారపక్షానికి టెన్షన్ పుట్టిస్తున్న నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతల మాటలు ఇష్టారాజ్యం అన్నట్లుగా మారాయి.
తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం తప్పించి అసెంబ్లీలో ఏనాడు జగన్ ముస్లింల గురించి మాట్లాడలేదన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రజల వద్దకు వెళ్లి నెత్తిన చేతులు పెట్టటం.. ముద్దులు పెట్టటం మినహా ప్రజలకు ఏం చేయలేదంటూ తన ఇరుకు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు.
జగన్ ఏమైనా సినిమా హీరోనా? మహాత్మాగాంధీనా? అంటూ ప్రశ్నించిన ఆయన.. ఈ నెల 9 నుంచి 21 వరకు నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తానని జగన్ చెప్పటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. "అక్కడికి వెళ్లి ఏం చేస్తావ్? తల మీద చేతులు పెడతావ్.. ముద్దులు పెడతావ్ తప్ప చేసేదేమైనా ఉందా? ఇప్పటివరకూ ఎక్కడైనా వంద రూపాయిలు ఇచ్చావా?" అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన స్థాయిని అంతకంతకూ దిగజార్చుకుంటూ ప్రజల్లో చులకన అయ్యేలా మాట్లాడుతున్న జలీల్ ఖాన్ మాటల్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇలాంటి ఆరాచక మాటలు చెబుతున్న అధికారపక్ష నేతకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.