వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ రీసెంటుగా తన తెలివితేటలను బయటపెట్టుకుని నవ్వుల పాలయని సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో ఆయన.. తాను బీకాం చదివానని... అందులో మ్యాథ్స్ - ఫిజిక్సు ఉన్నాయని చెప్పడంతో పాటు యాంకర్ తో వాదించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో జలీల్ ఖాన్ నాలెడ్జిపై సెటైర్లే సెటైర్లు. అయితే... తాజాగా మరో విషయం బయటపడింది. మ్యాథ్స్ - ఫిజిక్సు సంగతి పక్కనపెడితే జలీల్ ఖాన్ అసలు డిగ్రీయే చదవలేదట. ఆయన విద్యార్హత మెట్రిక్యులేషన్ మాత్రమేనట. అంటే... ఈ ఖాన్ దాదా అక్కడా అబద్ధమే చెప్పారన్నమాట.
మొన్నటి ఎన్నికల్లో జలీల్ ఖాన్ సమర్పించి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చూస్తే ఆయన విద్యార్హత మెట్రిక్యులేషన్ మాత్రమే. ఆయన అసలు డిగ్రీనే చదవలేదు. పదో తరగతి వరకు మాత్రమే ఆయన స్కూల్‌కు వెళ్లారు. స్వయంగా ఆయనే మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ లోనే తన అత్యధిక విద్యార్హత మెట్రిక్యూలేషన్ అని ప్రకటించారు. అయితే.. ఈ ఇంటర్వ్యూలో మాత్రం బీకాం అని చెప్పేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/