జలీల్ ఖాన్....ఈ పేరు గురించి పరిచయం అవసరం లేనంతగా పాపులర్ అయిపోయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ద్వారా గెలిచిన జలీల్ ఖాన్ అనంతరం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆసక్తికరమైన రిక్వెస్ట్ చేశారు. రంజాన్ సందర్భంగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయగా ఈ ఇఫ్తార్ విందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు - జలీల్ ఖాన్ ఇద్దరూ ప్రసంగించారు.
ముందుగా జలీల్ ఖాన్ ప్రసంగిస్తూ తన నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ ``నా జీవితాన్ని మీరే నిర్ణయించండి. వేరే వారి చేతుల్లో పెట్టవద్దు`` అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లకు ఆశ్చర్యపోతూనే చంద్రబాబు చిరునవ్వు చిందించారు. జలీల్ ఖాన్ తన ప్రసంగం కొనసాగిస్తూ పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లింల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కాగా, మైనార్టీల కోటాలో మంత్రి పదవిని ఆశించే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారనే ప్రచారం గతంలో సాగింది. తాజాగా జలీల్ ఖాన్ తన భవిష్యత్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇదే భావాన్ని వ్యక్తీకకరిస్తున్నాయని అంటున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మరెవ్వరూ చేయని విధంగా ముస్లింలకు తోఫా అందిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానిదని తెలిపారు. మసీదులు - దర్గాల మరమత్తుల కోసం రూ. కోటి మంజూరు చేశామని వెల్లడించారు. విజయవాడ, కడపలో హజ్ భవనాలను నంద్యాలలో మినీ హజ్ హౌజ్ ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ముస్లింల అభ్యున్నతికి తాను కట్టుబడి ఉన్నట్లు చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ బాధిత మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/