జల్లికట్టు ఎంత దారుణమంటే..

Update: 2017-01-28 07:09 GMT
తమిళనాడులో నిర్వహించిన జల్లికట్టు ఉద్యమం యావత్ దేశాన్ని ఎంతలా ఆకర్షించిందో తెలిసిందే. తమిళుల సంప్రదాయంగా చెప్పే ఈ క్రీడను విమర్శించేవారూ.. తప్పు పట్టే వారు ఎంతమందిఉంటారో.. దీనికి మద్దతు ఇచ్చేవారు.. అంతకు రెట్టింపు మంది ఉంటారనే చెప్పాలి. జల్లికట్టు మీద తమిళనాడులో అత్యధికులు మద్దతు పలికే ఈ సంస్కృతి మీద.. ఇతర ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు మాత్రం మరోలా ఉంటాయనటంలో ఎంతమాత్రం సందేహం లేదు.

జల్లికట్టును నిషేధించిన వైనాన్ని వ్యతిరేకించటం.. దీనికి తమిళ పార్టీలు.. సినీ రంగ ప్రముఖులు.. సెలబ్రిటీలు చాలామంది మద్దతు ఇవ్వటం తెలిసిందే. సుప్రీం బ్యాన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన తమిళ సమాజం.. దీనంతటికి కారణమైన పెటా సంస్థపై నిప్పులు చెరిగారు. మరికొందరైతే.. ఆ సంస్థను బ్యాన్ చేయాలన్న డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. జల్లికట్టు క్రీడ ఎంత దారుణంగా ఉంటుందో చెబుతూ నాలుగేళ్ల కిందట పెటా తయారు చేసిన వీడియో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. జల్లికట్టు క్రీడలో పశువుల్ని ఎంత దారుణంగా హింసిస్తారో తెలియజెప్పే రీతిలో ఉండే ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పెటా ఇన్వెస్టిగేషన్ చేసి.. బయటకు తీసిన అంశాలతో రూపొందించిన ఈ వీడియో చూసిన వారు.. జల్లికట్టు సందర్భంగా పశువులపై ప్రదర్శించే హింసను చూసి అయ్యో అనాల్సిందే. మూడు నిమిషాలకు ఒక్క సెకను తక్కువగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News