పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు.. ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. తాజాగా ఊహించని రీతిలో తెర మీదకు వచ్చిన ఒక ప్రముఖ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీని రిలాక్స్ అయ్యేలా చేస్తుందనటంలో సందేహం లేదు. మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం కలుగనీయదని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలోని ప్రముఖ జామా మసీదు ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తాజాగా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం చేయదన్నారు. ఇది కేవలం ఇతర దేశాల నుంచి వచ్చే ముస్లిం శరణార్దులకు మాత్రమే వ్యతిరేకమన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం.. జాతీయ పౌర పట్టిక గురించి ఆయన మాట్లాడారు. నిరసన తెలపటం ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు అని.. నచ్చని అంశం మీద నిరసన తెలియజేయటాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. అయితే.. ఇలాంటివి శాంతియుతంగా జరగాలే కానీ.. ఇష్టారాజ్యంగా చేయకూడదన్నారు.
భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకొని నిరసనలు చేపట్టాలన్నారు. తాజా చట్టంతో భారతదేశ ముస్లింలకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. జామా వర్సిటీ రణరంగంగా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలన్న సయ్యద్ మాటలు ఇప్పుడున్న పరిస్థితులు మోడీ సర్కారుకు అంతో ఇంతో మేలు జరగటం ఖాయమని చెప్పక తప్పదు.