తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అపార అనుభవం ఉన్న నేత కుందూరు జానారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా పేరొందారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ లోనే ఉండి అత్యున్నత పదవులను ఆధిష్టించారాయన. కానీ తాజాగా జానారెడ్డి ‘జంప్’ అవుతున్నారన్న వార్త కలవరం రేపుతోంది. జంప్ అనగానే ప్రస్తుతం ఫిరాయింపుల్లో భాగంగా ఆయన పార్టీ మారుతున్నాడని కాదు.. జానారెడ్డి అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే జానారెడ్డి. నరనరాల్లో కాంగ్రెస్ వాదాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన ఆ పార్టీని వీడే ప్రసక్తే లేదు. కాకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ లో సీఎం కేసులో ఉన్న జానారెడ్డి తను సేఫ్ గా ఉండడం కోసమే నియోజకవర్గం మారే ఆలోచనలో ఉన్నాడట.. ఎన్నో ఏళ్లుగా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న ఆయన తాజాగా మిర్యాలగూడకు ‘జంప్’ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
2014 ఎన్నికల్లో మిర్యాల గూడ నుంచి తన రాజకీయ శిష్యుడు భాస్కర్ రావుకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించి మరీ జానారెడ్డి గెలిపించుకున్నారు. కానీ భాస్కర్ రావు అధికార పార్టీ మోజులో పడి కారెక్కేశాడు. ఇప్పుడు మిర్యాలగూడలో కాంగ్రెస్ కు అభ్యర్థే కరువయ్యాడు. జానారెడ్డికి మిర్యాల గూడలో భారీ అనుచర గణం ఉంది.ఇప్పుడు తన ఫాలోయింగ్ ను తానే వాడేసుకొని మిర్యాలగూడలో గెలవాలని జానా స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తను మిర్యాల గూడకు మారితే ఖాళీ అయ్యే నాగార్జున సాగర్ నుంచి తన కొడుకు రఘురెడ్డిని పోటీచేయించి గెలిపించాలని చూస్తున్నట్టు సమాచారం. రాబోయే అసెంబ్లీలో తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఎంట్రీ ఇవ్వాలని జానా కుటుంబం ప్రణాళిక రచించినట్టు తెలిసింది.
అందుకే ఈ మధ్య జానారెడ్డి మిర్యాల గూడలో తరచూ పర్యటిస్తున్నారు. సంచలనం సృష్టించిన పరువు హత్యలో మిర్యాల గూడ కాంగ్రెస్ నేత కరీం ప్రమేయం ఉందని తెలియగానే పార్టీ నుంచి జానారెడ్డియే సస్పెండ్ చేయించినట్టు వార్తలొచ్చాయి. అక్కడితో ఆగకుండా.. ఏకంగా మిర్యాల గూడ వెళ్లి భర్తను కోల్పోయి విషాధంలో ఉన్న అమృతవర్షిణిని జానారెడ్డి పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటానని భరోసానిచ్చారు. దీంతో జానారెడ్డి మిర్యాలగూడ పాలిటిక్స్ లోకి పాగా వేసినట్టేనని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.