తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో మరోమారు ముఖ్యమంత్రి పీఠంపై చర్చ జోరందుకుంది. ఎప్పటికప్పుడు ఈ చర్చకు శుభం కార్డు పడుతున్నప్పటికీ...మరోవైపు అంతే తరచుగా సీఎం కుర్చీ గురించి ఆయా నాయకులు పోటీ పడుతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా సీఎల్పీ నేత జానారెడ్డి ఇదే రీతిలో రియాక్టయ్యారు. సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని, ఆ అర్హతలో తాను అందరికంటే ముందుంటానని అన్నారు. దీంతో మరోమారు తాను సీఎం అవ్వాలన్న ఆకాంక్షను సీఎల్పీ నేత కే జానారెడ్డి పరోక్షంగా వ్యక్తపరిచారు. కాగా సీఎం ఎవరు కావాలనేది సమయం - సందర్భాన్ని బట్టి పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
ఇక సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందిస్తూ ప్రతిసారీ అన్నింటికీ సమాధానాలు చెప్పలేమన్నారు. గౌరవంగా ఉండాలని - ఏవైనా సమస్యలుంటే పార్టీ లోపల చర్చించుకోవాలని అభిప్రాయపడ్డారు. రాజీనామా అంశం తనతో కోమటిరెడ్డి చెప్పలేదని పేర్కొన్నారు.రాజీనామా అంశం చర్చకే రాలేదని - అధిష్టానం చెప్తే.. దేనికైనా ముందు వరుసలో ఉంటానని స్పష్టంచేశారు. చాలెంజ్ చేసినప్పుడు దేనికైనా క్రమపద్ధతి ఉంటుందని.. ఎవరైనా వ్యక్తులు ఇలాంటివి చెప్తే ఖండిస్తానని అన్నారు. `జానారెడ్డి అన్నింటికీ ముందుంటాడు.. రెడీగా ఉంటాడు.. ప్రతిసారీ ఇలా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. సభ్యులు ఒత్తిడితో, ఆవేదనతో తమ మీద ఆరోపణలు చేయవచ్చు. వాటిని తప్పుపట్టడం లేదని జానా స్పష్టంచేశారు. కోమటిరెడ్డి - సంపత్ విషయంలో సీఎల్పీ తరఫున చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాం` అని వెల్లడించారు. ఇంకా ఎక్కువ వ్యవహరించాల్సి వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధిష్ఠానం ఎలా చెప్తే అలా నడుచుకుంటామని అన్నారు. తమ సభ్యులకు అవసరమైన సదుపాయాలు - హక్కులను కాపాడేలా వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గతంలో తనకు టీడీపీ ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వకపోతే.. లేఖ రాసి పోరాటం చేశానని చెప్పారు. అదే రీతిలో కోమటిరెడ్డి అడుగులు వేయవచ్చని సూచించారు.
అయితే, కాంగ్రెస్ కు అదికారం దక్కే లెక్కలపై ఆయన జానారెడ్డి ఆసక్తిగా స్పందించారు. నాలుగేళ్లు అధికారంలో లేనంతమాత్రాన ఆదుర్దా - గందరగోళం లేదన్నారు. తప్పకుండా అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం అందరూ కలిసి పనిచేయడం పార్టీకి - పార్టీనేతలకు శ్రేయస్కరమన్నారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగి అధికారం కైవసం చేసుకోవాలన్నా జానారెడ్డి ఈ విషయంలో విమర్శలు చేసుకోవడం పార్టీ పరువును పలుచన చేస్తుందన్నారు.కాంగ్రెస్ భావజాలంతో కలిసి వచ్చే నాయకులతో ముందుకు సాగి పోరాటం చేయాలని అప్పుడే అధికార సొంతం చేసుకునే అవకాశాలు మరింత మెరుగు అవుతాయని అన్నారు.