పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏపీలోని అధికార.. విపక్షాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇదంతా తెలంగాణ మీదున్న వ్యతిరేకత కారణంగా అన్న మాటల్ని తెలంగాణ అధికారపక్షం చెబుతోంది. తెలంగాణ మీదున్న అక్కసుతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. విపక్ష నేత వైఎస్ జగన్ వ్యతిరేకిస్తున్నారంటూ తెలంగాణ అధికారపక్ష నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు.. ఎమ్మెల్యేల వరకూ ఏపీ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏపీ అధికార.. విపక్షం మాత్రమే కాదు.. తెలంగాణలోని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత.. సీనియర్ నేత జానారెడ్డి చెబుతున్న లెక్క అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాలమూరు ఎత్తిపోతల పథకం సక్సెస్ రేటుపై ఆయన సందేహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. దీనికి సంబంధించి ఆయన విశ్లేషణాత్మకంగా చెబుతున్న లెక్కలు లాజిక్ కు దగ్గరగా ఉండటమేకాదు.. ఈ ప్రాజెక్టు మీద కేసీఆర్ అండ్ కో చేస్తున్న వాదనపై సరికొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చేయటం గమనార్హం.
పాలమూరు మీద జానారెడ్డి పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. ఈ ప్రాజెక్టు మీద పెట్టే ఖర్చు.. దాని వల్ల కలిగే లాభానికి సంబంధించి ఆయనో పెద్ద లెక్కనే చెబుతున్నారు. ఆ లెక్క ప్రకారం పాలమూరు ఎత్తిపోతల పథకం సక్సెస్ రేటు 25 శాతం మాత్రమే ఉండటం కాదు.. పెట్టే ఖర్చుకు వచ్చే లాభానికి ఎలాంటి పోలిక ఉండదని జానారెడ్డి వాదన. ఆయన చెబుతున్న లాజిక్ ఏమిటంటే..
= నాలుగేళ్లకు ఒకసారి ప్రాజెక్టులకు నీళ్లు అందుతాయి.
= ఈ ప్రాజెక్టులో ఎకరానికి నీళ్లు అందించటానికి అయ్యే ఖర్చు రూ.3.5 లక్షల నుంచి రూ.4లక్షలు అవుతుంది. కానీ.. లాభం మాత్రం రూ.30వేలే.
= ఈ ప్రాజెక్టు కారణంగా ఒక ఎకరానికి నీళ్లు అందించటానికి అయ్యే ఖర్చు రూ.3.5లక్షల నుంచి రూ.4 లక్షలు.
= ఈ ఖర్చుకు పదిశాతం వడ్డీని లెక్కిస్తే నాలుగేళ్లకు ర.1.4 లక్షల నుంచి రూ.1.6లక్షలు అవుతుంది.
= విద్యుత్ ఛార్జీలు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ అవుతాయి.
= నాలుగేళ్ల లెక్కలో తరుగుదల.. వడ్డీ.. విద్యుత్ ఛార్జీలు కలిపితే ఎకరానికి అయ్యే ఖర్చు రూ.2లక్షలు.
= కానీ.. అదే ఎకరం పంట మీద కలిగే ప్రయోజనం రూ.30వేల నుంచి రూ.40వేలు మాత్రమే.
= అంటే.. పెట్టే పెట్టుబడికి.. దాని వల్ల కలిగే ఫలితానికి మధ్య సంబంధం అస్సలు ఉండదన్న మాట.