తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన జానారెడ్డిపై ఆ పార్టీ నేతలు చాలాకాలంగా ఓ ఆరోపణ చేస్తున్నారు. తెలంగానలో సీఎల్పీ నేతగా ఉంటూ ఆయన టీఆరెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నది ఆ ఆరోపణ. అయితే... దాన్ని ఖండిస్తూ వస్తున్న ఆయన ఇటీవల టీఆరెస్ విధానాలపై ఒకట్రెండు సార్లు గళమెత్తి తాను కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నానని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అయితే... తాజాగా ఆయన మరోసారి టీఆరెస్ ప్రభుత్వ అభివృద్ది పనులను ప్రశంసించి... నిరసనలు చేస్తున్న తమ పార్టీ నేతలను ఇరుకునపెట్టారు. దీంతో కాంగ్రెస్ నేతలు జానారెడ్డిపై మండిపడుతున్నారు.
ఎలిమినేటి మాధవరెడ్డి పంప్ హౌస్ ట్రయల్ రన్ పనులను పరిశీలించేందుకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వెళ్లిన సమయంలోనే అక్కడికి ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా వచ్చారు. జానారెడ్డి వచ్చారన్న విషయం తెలుసుకున్న గుత్తా ఆయన వద్దకు వెళ్లి పలకరించారు. ఇద్దరూ కాసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. పంప్ హౌస్ ద్వారా 50వేల ఎకరాలకు నీళ్లివ్వాలన్న అధికార పార్టీ ప్రయత్నాన్ని జానారెడ్డి బహిరంగంగానే మెచ్చుకున్నారు. పదిరోజులుగా ఇందుకోసం అధికారులు పడుతున్న శ్రమను తాను గుర్తించానని అన్నారు. నిన్న మొన్నటిదాకా తన విమర్శలతో సర్కారును ఇరుకున పెట్టిన జానారెడ్డి - ఇప్పుడు అందరి ముందు ప్రశంసలతో ముంచెత్తడం అక్కడున్న వారిని, ఈ వార్త విన్న కాంగ్రెస్ నాయకులు షాక్ అయ్యారు. జానారెడ్డి మీడియా ముందు ఇలా ప్రత్యర్థి పార్టీని పొగడటం ఏమీ బాలేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
కాగా గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికలకు ముందు ప్రభుత్వ పనులను జానా ప్రశంసించారు.. 5 రూపాయల భోజనాన్ని తెప్పించుకుని తిని మరీ దాన్ని ప్రశంసించి కాంగ్రెస్ కు నష్టం కలిగించారు. ఆ ఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో ఆ సంఘటనపై అధిష్టానం ఆయన్ను వివరణ కూడా కోరింది. అయినా ఆయన తీరులో మార్పు రాలేదు. తాజాగా మరోసారి సర్కారును పొగిడి.. తెలంగాణ కాంగ్రెస్ ఇరుకునపెట్టారు జానారెడ్డి. గొప్పలకు పోయి చేస్తున్నారో లేదంటే టీఆరెస్ తో కుమ్మక్కయ్యారో కానీ జానా మాత్రం నెరజానాలా మారిపోయారంటున్నారు కాంగ్రెస్ నేతలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/