బాహుబ‌లి రాక‌పై జానా తాజా విశ్లేష‌ణ ఇది

Update: 2017-11-06 13:17 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవ‌లి కాలంలో చేరిక‌ల జోరు పెరిగిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో ఈ జోష్ రాగా ఆయ‌న వెంట వ‌చ్చిన నాయ‌కుల‌తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీకి మ‌రింత ఊపు వ‌చ్చింది. భ‌విష్య‌త్తులో కాంగ్రెస్‌ను న‌డిపించేది రేవంత్ అని కొంద‌రు... రేవంత్ సోలో షో అంటూ ఉండ‌ద‌ని... ఆయ‌న కూడా సీనియ‌ర్ల‌తో క‌లిసి సాగుతార‌ని మ‌రికొంద‌రు త‌మ త‌మ అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌ ను పార్టీ సీనియ‌ర్లు, అందులోనూ ముఖ్యులు ఎలా చూస్తున్నార‌నేదిస‌హ‌జంగానే ఆస‌క్తిక‌ర‌మైన అంశం. కాంగ్రెస్ పార్టీలోకి బాహుబ‌లి వ‌స్తాడ‌ని గ‌తంలో వ్యాఖ్యానించిన సీఎల్పీ నేత జానారెడ్డి తాజాగా రేవంత్ ఎంట్రీపై మ‌ళ్లీ రియాక్ట‌య్యారు.

ప్ర‌స్తుత రాజ‌కీయాలు విబిన్న రీతిలో ఉన్నాయ‌ని తాజాగా మీడియాతో ఇష్టాగోష్టిలో జానారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లోకి రేవంత్ ఎంట్రీ గురించి ప్ర‌స్తావిస్తూ...బాహుబలులు ఇప్పటికే వచ్చారని.... ఇంకా వస్తారని చెప్పుకొచ్చారు. సినిమాలో వచ్చే బాహుబలి కాదు...ఇంకెంత బాహుబలులు వస్తారో మీరే చూస్తారని జానారెడ్డి న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్యాలు చేశారు. ప్రతిపక్షాలు వివరణ చెబితే ప్రభుత్వం నుంచి వినిపించుకోవడంలేదని అదే స‌మ‌యంలో మీడియా వాళ్ళు ప్రకటనలు తీసుకుంటలేర‌ని జానారెడ్డి వాపోయారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో తామేం చేసేదని జానారెడ్డి ఆవేద‌నాభ‌రితంగా ప్ర‌శ్నించారు. తాము ఒక్క‌ళ్ల‌మే కాకుండా వ్యవస్థలు కూడా సహకరిస్తే సక్సెస్ అవుతామ‌ని తెలిపారు. 8సార్లు ప్రజలు ఓట్లేసి త‌న‌ను గెలిపించారని..అయితే...ఇప్పుడున్న రాజ‌కీయాల‌కు తాను సరిపోతానా అని సంఘర్షణ పడుతున్నానని జానా వివ‌రించారు. రాజకీయాల్లో ఏం మాట్లాడాలో ఆలోచించి మాట్లాడాలని...అలా మాట్లాడడం చేతకాకుంటే కామ్ గా ఉండాలని తెలిపారు.

రాష్ట్ర రాజ‌కీయాల గురించి వివ‌రిస్తూ రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ - టీఆర్ ఎస్‌ కు గెలుపు అవ‌కాశాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ ఉంద‌ని జానారెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వం ప‌నితీరు, ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించే విధానాన్ని బ‌ట్టి ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌ట్టాలో నిర్ణ‌యం తీసుకుంటార‌ని వివ‌రించారు.
Tags:    

Similar News