కేంద్రంలో మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి పెద్ద ఆపద నుంచి రక్షించారట. శత్రువులు దండెత్తి దాడికి వస్తే అశోక్ మంచం కింద దాక్కున్నప్పుడు జానారెడ్డి తుపాకీ బయటకు తీసి వారిని బెదిరించి అశోక్ ను కాపాడారట. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ స్టోరీ ఈనాటిది కాదు. జమానాలోనిది. నిన్నటి తెలంగాణ బీఏసీ మీటింగ్ లో జానారెడ్డి - కేసీఆర్ లు కలిసి గతంలోకి వెళ్లిపోయారు. అప్పట్లో వీరంతా టీడీపీలో ఉన్న రోజులను నెమరేసుకుంటూ ఈ సంగతి గుర్తు చేసుకున్నారు.
తాను టీడీపీలో ఉన్నప్పటి రోజులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేసుకుంటే - ప్రాణభయంతో పరుగులు తీసిన అశోక్ గజపతి రాజును తానే రక్షించానని జానారెడ్డి పేర్కొన్నారు. మొదట కేసీఆర్ మాట్లాడుతూ.. తాను టీడీపీలో ఉన్నప్పుడు జానారెడ్డి - తాను - అశోక్ గజపతిరాజు - మరికొందరు నేతలం కలిసి ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకునేవాళ్లమని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అప్పటి రాజకీయాలే వేరని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
కేసీఆర్ మాటలకు స్పందించిన సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. ఒకసారి అశోక్ గజపతి రాజు.. రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడారని తెలిపారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ వాళ్లు అశోక్ పై దాడిచేయడానికి వస్తే ఆయన మంచం కింద దాక్కున్నారని పేర్కొన్నారు. అశోక్ సతీమణి భయపడి కేకలు వేయడంతో తాను రివాల్వర్ బయటకు తీసి అశోక్ ను కాపాడానని గుర్తు చేశారు. అదండీ సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/